Pawan Kalyan Powerful comeback.. కూర్చొండి నందాజీ.. అంటూ సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం.. హోరెత్తుతున్న ట్విట్టర్

పవర్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో పోస్టుల సునామీ చెలరేగింది. సెలబ్రిటీలందరూ పవర్ స్టార్ అభిమానులుగా మారిపోయి కమ్‌బ్యాక్‌ను స్వాగతించారు. వకీల్ సాబ్ ట్రైలర్‌ గురించి, సాంకేతిక నిపుణుల గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వకీల్ సాబ్ ట్రైలర్ గురించి సినీ ప్రముఖులు, తారలు ఏమని ట్వీట్ చేశారంటే..

 బోనికపూర్ క్రేజీ ట్వీట్

బోనికపూర్ క్రేజీ ట్వీట్

సరైన వ్యక్తి సరైన సైడ్‌ను ఉంటే అల్టిమేట్‌గా న్యాయం జరుగుతుంది అంటూ నిర్మాత బోనికపూర్ ట్వీట్ చేశారు. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత యూట్యూబ్ లింక్‌ను షేర్ చేశారు.

పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో

పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో

వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గారి పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్, ఆయన యాటిట్యూడ్, వకీల్ సాబ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ చూడాలని ఆతృతంగా ఎదురుచూస్తున్నాం అని నిర్మాత రామ్ ఆచంట ట్వీట్ చేశారు.

 పవర్ ప్యాక్డ్‌గా ఉందంటూ తరుణ్ ఆదర్శ్

పవర్ ప్యాక్డ్‌గా ఉందంటూ తరుణ్ ఆదర్శ్

వకీల్ సాబ్ ట్రైలర్ బాగుంది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌తో మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ట్రైలర్ చాలా పవర్ ప్యాక్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమాకు శ్రీరాం వేణు రూపొందించిన వకీల్ సాబ్ ట్రైలర్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్

నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్


వకీల్ సాబ్ ట్రైలర్‌కు తమన్ మ్యూజిక్ పెద్ద అసెట్, పీఎస్ వినోద్ కెమెరా మూడ్ చాలా బాగుంది. ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ సూపర్బ్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్, పవర్‌స్టార్ పవన్ కల్యాన్ పవర్ఫుల్ కమ్ బ్యాక్, కంటెంట్ ఓరియెంట్ ఫిలిం అంటూ రచయిత గోపి మోహన్ ట్వీట్ చేశారు.

 బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడా అంటూ

బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడా అంటూ

పవర్ స్టార్ ఈజ్ కమ్ బ్యాక్ విత్ వకీల్ సాబ్ ట్రైలర్. బిగ్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నాను. అంటూ దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు.

వాట్ ఏ కమ్ బ్యాక్ అంటూ...

వాట్ ఏ కమ్ బ్యాక్ అంటూ...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్‌పై అనిల్ రావిపూడి ప్రశంసల వర్షం కురిపించారు. వాట్ ఏ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

కల్యాణ్ మామ అంటూ సాయిధరమ్ తేజ్

కల్యాణ్ మామ అంటూ సాయిధరమ్ తేజ్

పవన్ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌తో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ట్రైలర్‌లో ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి కూర్చొండి నందాజీ అనే పవన్ కల్యాణ్ డైలాగ్‌ను హైలెట్ చేశారు. పవన్ కల్యాన్ మామను తెర మీద అలా చూడటానికి కళ్లు చాలలేదు అంటూ సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

డార్లింగ్ థమన్, వేణు శ్రీరాంతో

డార్లింగ్ థమన్, వేణు శ్రీరాంతో

పవన్ కల్యాణ్ బ్యాక్ విత్ వకీల్ సాబ్. పవర్ స్టార్ యాటిట్యూడ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్. డార్లింగ్ థమన్ మ్యూజిక్, శ్రీరాం వేణు రాకింగ్. థియేటర్‌లో ఈ సినిమా చూడటానికి రెడీ అవుతున్నాను అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.

 శివకార్తికేయన్ ట్వీట్‌తో ప్రశంస

శివకార్తికేయన్ ట్వీట్‌తో ప్రశంస

పవన్ కల్యాణ్, వకీల్ సాబ్ ట్రైలర్‌పై తమిళ నటుడు శివకార్తీకేయన్ ట్వీట్ చేశారు. మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ యాక్షన్‌తో తిరిగి వస్తున్నారు. ఈ సారి మరింత పవర్‌తో కనిపించాడు. వకీల్ సాబ్ ట్రైలర్ బాగుంది. అద్భుతమైన సక్సెస్‌ను సాధించాలని పవన్ కల్యాణ్‌కు నా విషెస్ అందజేస్తున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X