హీరోయిన్‌తో ప్రేమ, పెళ్లి విషయంలో.. శివ బాలాజీ షాకింగ్ ట్విస్ట్
సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటులెందరో . ఈ కోవలోకే వస్తారు శివబాలాజీ - మధుమిత. సినిమాల్లో మాదిరిగానే ట్విస్టులు, గొడవలతో సాగిన వీరి ప్రేమాయణం చివరికి పెళ్లిపీటలకు చేరింది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కపుల్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ జంట .. ఒకానొక సమయంలో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. విడాకులకు అన్ని సిద్ధం చేసుకున్న దశలో వీరి లైఫ్ చిత్రమైన మలుపు తిరిగిందట. ఈ వివరాల్లోకి వెళితే :
ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలాజీ.. తొలుత హీరోగా నటించినా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా బిజీ అయ్యారు. ఆర్య, సంక్రాంతి, అన్నవరం, చందమామ, శంభో శివ శంభో, కాటమరాయుడు వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్ తొలి సీజన్ విజేతగా నిలిచి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన మంచితనంతో హౌస్‌లో పెద్ద మనిషిగా అందరికీ సలహాలిస్తూ టైటిల్ అందుకున్నారు.

శివబాలాజీ , మధుమితలు ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో బాగా దగ్గరయ్యారు. వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి చివరికి 2009లో పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ప్రపోజ్ అనగానే కేవలం ఐ లవ్ యూ అని కాకుండా.. ఏకంగా పెళ్లి చేసుకుందామని మధుమితను అడిగేశారట శివబాలాజీ. అయితే శివ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు జాతకాలు, జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. జాతకాలు చూసి ఇద్దరికి సెట్ అవ్వదని .. పెళ్లికి నో చెప్పారట.
ఈ విషయాన్ని శివబాలాజీ మధుకి చెప్పగా, ఆమె అలిగి దాదాపు ఏడాదిన్నర పాటు మాట్లాడుకోలేదట. దూరంగా ఉన్నా.. మధుమిత యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు శివ. ఓ రోజున మెసేజ్ పెట్టి జీవితంలో ఇంకెప్పుడూ వదిలిపెట్టనని చెప్పి తిరిగి మధుమితకు దగ్గరయ్యారు. తర్వాత ఇద్దరూ ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం .. అవి వీరిద్దరి మధ్యా వచ్చాయి. ఈ భేదాభిప్రాయాలతో శివబాలాజీ- మధుమిత విడిపోవాలని అనుకున్నారట.

ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీరిద్దరూ విడిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. విడాకుల డెసిషన్ తీసేసుకున్నారని.. అయితే బెదిరించడానికేనని మధుమిత తెలిపారు. తాను ఏదో జరుగుతుందని భయపడలేదని.. నాకు తెలిసినంతలో హ్యాండిల్ చేశానని ఆమె వెల్లడించారు. పెద్ద బాబు పుట్టిన తర్వాత వాడిని చూడాలని శివకు బాగా ఉండేదని, జీవితం అలా వెళ్తోందని... తాను అమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశానని మధుమిత గుర్తుచేశారు.
ఆయన బెంగళూరులోని తన కజిన్స్ దగ్గరికి వెళ్లగా.. వాళ్లకు తాను కనిపించకపోవడంతో డౌట్ వచ్చి నాకు కాల్ చేయమని చెప్పగా శివ చేయలేదని తెలిపారు. దీంతో వాళ్లకి మేటర్ అర్ధమై.. నువ్వెళ్లి మధుని తీసుకురావాలని వాళ్లు చెప్పారని, ఆ వెంటనే ఆయన కాల్ చేశారని తాను రావడానికి ఓ కండీషన్ పెట్టానని మధుమిత గుర్తుచేసుకున్నారు. నువ్వు మా ఇంటికి వచ్చి సారీ చెబితేనే నేనొస్తానని అన్నానని.. కానీ ఆయన వచ్చాక సారీ అవేం పట్టించుకోకుండా శివబాలాజీతో తిరిగి వెళ్లానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











