CCL 2025: సీసీఎల్‌కు సర్వం సిద్దం.. కన్నడతో తెలుగు వారియర్స్‌కు టఫ్ ఫైట్ తప్పదా?
భారతీయ చలనచిత్ర నటులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ - 2025 (CCL-2025) ప్రారంభం కానుంది. ఇందుకు సర్వ సిద్ధం అయ్యింది. రేపటి నుంచే మ్యాచ్ లు రసవత్తరంగా కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. తొలిరోజే తెలుగు వారియర్స్ ప్రత్యర్థి జట్టుతో తలపడుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. తొలిరోజు జరిగే మ్యాచ్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తొలిరోజు రెండు మ్యాచ్ లు జరగున్నాయి. మొత్తం నాలుగు జట్ల మధ్య మధ్యాహ్నం తర్వాత వరసగా రెండు మ్యాచ్ లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు రోజులు ఈ లీగ్ కొనసాగనుంది. ఫస్ట్, సెకండ్ మ్యాచ్ లలో తలపడే జట్లకు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ ను పూర్తి చేసుకొని వార్ కు సిద్ధమయ్యాయి. ఇక వీరి ప్రదర్శనకు బెంగళూరు వేదిక అయ్యింది.

శనివారం, ఫిబ్రవరి 8న(రేపు)న సీసీఎల్ -2025 ప్రారంభం అవుతుంది. లీగ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజీల్లోని ప్రధాన భాషల్లోన్ని అన్ని భాషల ఇండస్ట్రీల నుంచి తారలు ఈ లీగ్ లో ఆడుతున్నారు. తొలిరోజు రేపు జరగబోయే మ్యాచ్ లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ మొదటి రెండు మ్యాచ్ లు ఆడబోతున్నాయి.
రేపు మధ్యాహ్నా 2:00 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చైన్నై రైనోస్ - బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కర్ణాటక బుల్డోజర్స్ - మన టీమ్ తెలుగు వారియర్స్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లకు బెంగళూరులోని KSCA చిన్నస్వామి స్టేడియం వేదికగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ సోర్ట్స్ 3లో లైవ్ మ్యాచ్ వీక్షించవచ్చు. టికెట్స్ బుక్ చేసుకునే వారికి బుక్ మై షో, టికెట్ జీనీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 పూర్తి షెడ్యూల్ వివరాల విషయానికొస్తే..
ఫిబ్రవరి 8న... బెంగళూరులో.. :
1.చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ (మధ్యాహ్నం 2:00)
2.కర్ణాటక బుల్డోజర్స్ vs తెలుగు వారియర్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 9న.. ఢిల్లీలో.. :
3. బెంగాల్ టైగర్స్ vs పంజాబ్ ది షేర్ (మధ్యాహ్నం 2:00)
4. ముంబై హీరోస్ vs భోజ్‌పురి దబాంగ్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 14న.. హైదరాబాద్ లో.. :
5.చెన్నై రైనోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ (సాయంత్రం 2:00)
6. భోజ్‌పురి దబాంగ్స్ vs తెలుగు వారియర్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 15న.. హైదరాబాద్ లో.. :
7.ముంబై హీరోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ (మధ్యాహ్నం 2:00)
8.చెన్నై రైనోస్ vs తెలుగు వారియర్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 16న.. కటక్ లో.. :
9. పంజాబ్ ది షేర్ vs భోజ్‌పురి దబాంగ్స్ (మధ్యాహ్నం 2:00)
10. ముంబై హీరోస్ vs బెంగాల్ టైగర్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 22న.. సూరత్ లో.. :
11. భోజ్‌పురి దబాంగ్స్ vs చెన్నై రైనోస్ (సాయంత్రం 2:00)
12. పంజాబ్ ది షేర్ vs కర్ణాటక బుల్డోజర్స్ (సాయంత్రం 6:30)
ఫిబ్రవరి 23న.. సూరత్ లో..
13. బెంగాల్ టైగర్స్ vs తెలుగు వారియర్స్ (సాయంత్రం 2:00)
14. ముంబై హీరోస్ vs పంజాబ్ ది షేర్ (సాయంత్రం 6:30)
ఇక మార్చి 1, 2న సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన అఖిల్ టీమ్.. ఈ సారి కూడా గట్టిగానే ఆడతామని ఇప్పటికే హామీనిచ్చారు. ఇక పోరు ఎలా సాగుతుందోచూడాలి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు సినీ ప్రియులు, ఆయా తారల అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











