CCL 2026 Schedule: సీసీఎల్ షెడ్యూల్ 2026.. ఏ జట్టు ఎవరితో అంటే? సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

దేశంలో క్రికెట్, సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లు, సినీతారలను మన జనాలు దేవుళ్ల మాదిరిగా ఆరాధిస్తారు. అలాంటిది సినీతారలు స్వయంగా బ్యాట్, బాల్ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగితే. ఈ ఆలోచనకు రూపమే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్). భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు జట్లుగా విడిపోయి మైదానంలో తలపడితే ఆ మజాయే వేరు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా సీసీఎల్ 2026 షెడ్యూల్‌ విడుదలైంది. మరి ఏ జట్టు ఎవరితో తలపడనుంది? సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? మన తెలుగు వారియర్స్ జట్టు ఎవరితో తలపడనుంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

సీసీఎల్‌లో సక్సెస్‌ఫుల్ జట్టుగా తెలుగు వారియర్స్:
దేశంలో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరిగా సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకంగా క్రికెట్ లీగ్ ఉంటే బాగుంటుందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విష్ణువర్థన్ ఇందూరి సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్)కు శ్రీకారం చుట్టారు. 2011 నుంచి 2025 వరకు మొత్తం 11 సార్లు సీసీఎల్ జరిగింది. భారతదేశంలో కరోనా వైరస్, లాక్‌డౌన్, ఇతర కారణాలతో 2018, 2020, 2021, 2022లలో సీసీఎల్ జరగలేదు. ఇక సీసీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా తెలుగు వారియర్స్ నిలిచింది. మన జట్టు నాలుగు సార్లు సీసీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నై రైనోస్ రెండు సార్లు, కర్ణాటక బుల్డోజర్స్ రెండు సార్లు, ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ దే షేర్ జట్లు తలో ఒకసారి సీసీఎల్ ట్రోఫీ దక్కించుకున్నాయి.

Celebrity Cricket League CCL 2026 Schedule Here is Match dates Venues Timings details

సీసీఎల్ 2026లో జట్ల వివరాలు:
సీసీఎల్ 2026లో పంజాబ్ దే షేర్, భోజ్‌పురి దబాంగ్స్, చెన్నై కింగ్స్, బెంగాల్ టైగర్స్, తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు చెన్నై రైనోస్‌గా ఉన్న చెన్నై జట్టు పేరు ఈసారి చెన్నై కింగ్స్‌గా మారింది. 2026 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సీసీఎల్ 2026 జరగనుంది. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు, జనవరి 31న సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 జరగనుండగా.. ఫిబ్రవరి 1వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సీసీఎల్ 2026 వేదికలు:
మధురై, మైసూర్‌లలో లీగ్ మ్యాచ్‌లు, సెమీ ఫైనల్స్, ఫైనపల్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్స్, సెమీఫైనల్స్ రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు ఒక మ్యాచ్.. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఒక మ్యాచ్ జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 4వ స్థానంలో ఉన్న జట్టుతో తొలి ఫైనల్ ఆడుతుంది. అలాగే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు.. 3వ స్థానంలో ఉన్న జట్టుతో రెండో సెమీఫైనల్ ఆడనుంది. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు .. ఫైనల్‌లో తలపడనున్నాయి.

సీసీఎల్ 2026 - కెప్టెన్లు వీరే:

  1. తెలుగు వారియర్స్ - అఖిల్ అక్కినేని
  2. కర్ణాటక బుల్డోజర్స్ - కిచ్చా సుదీప్
  3. చెన్నై కింగ్స్ - ఆర్య
  4. కేరళ స్ట్రైకర్స్ - ఉన్ని ముకుందన్
  5. భోజ్‌పురి దబాంగ్స్ - మనోజ్ తివారీ
  6. బెంగాల్ టైగర్స్ - జిషుసేన్ గుప్తా
  7. పంజాబ్ దే షేర్ - సోనూసూద్
  8. ముంబై హీరోస్ - రితేష్ దేశ్‌ముఖ్

సీసీఎల్ 2026 షెడ్యూల్ ఇదే

  • తొలి మ్యాచ్ (16.01.26 - మధురై) : పంజాబ్ దే షేర్ VS భోజ్‌పురి దబాంగ్స్
  • 2వ మ్యాచ్ (16.01.26 - మధురై) : చెన్నై కింగ్స్ VS బెంగాల్ టైగర్స్
  • 3వ మ్యాచ్ (17.01.26 - మధురై) : పంజాబ్ దే షేర్ VS తెలుగు వారియర్స్
  • 4వ మ్యాచ్ (17.01.26 - మధురై) : చెన్నై కింగ్స్ VS కేరళ స్ట్రైకర్స్
  • 5వ మ్యాచ్ (18.01.26 - మధురై) : ముంబై హీరోస్ VS బెంగాల్ టైగర్స్
  • 6వ మ్యాచ్ (18.01.26 - మధురై) : కర్ణాటక బుల్డోజర్స్ VS తెలుగు వారియర్స్
  • 7వ మ్యాచ్ (23.01.26 - మైసూర్) : ముంబై హీరోస్ VS కేరళ స్ట్రైకర్స్
  • 8వ మ్యాచ్ (23.01.26 - మైసూర్) : కర్ణాటక బుల్డోజర్స్ VS భోజ్‌పురి దబాంగ్స్
  • 9వ మ్యాచ్ (24.01.26 - మైసూర్) : బెంగాల్ టైగర్స్ VS కేరళ స్ట్రైకర్స్
  • 10వ మ్యాచ్ (24.01.26 - మైసూర్) : చెన్నై కింగ్స్ VS ముంబై హీరోస్
  • 11వ మ్యాచ్ (25.01.26 - మైసూర్) : తెలుగు వారియర్స్ VS భోజ్‌పురి దబాంగ్స్
  • 12వ మ్యాచ్ (25.01.26 - మైసూర్) : పంజాబ్ దే షేర్ VS కర్ణాటక బుల్డోజర్స్
  • 13వ మ్యాచ్ (31.01.26 - హైదరాబాద్) : సెమీఫైనల్ - 1
  • 14వ మ్యాచ్ (31.01.26 - హైదరాబాద్) : సెమీఫైనల్ - 2
  • 15వ మ్యాచ్ (01.02.26 - హైదరాబాద్) : ఫైనల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X