CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌‌ 2026... తెలుగు వారియర్స్ మ్యాచ్‌లు ఎప్పుడు? ఏయే జట్లతో అంటే?

వెండితెర వేల్పులుగా అభిమానులతో నీరాజనాలు అందుకునే సినీతారలలో ఎందరో క్రీడాకారులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రికెట్, వాలిబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్‌ ఆటలు అద్భుతంగా ఆడగలిగేవారు ఉన్నారు. క్షణం తీరిక లేని బిజీ లైఫ్‌‌లో ఇలాంటి ఆటలతో మన స్టార్స్ ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందుతుంటారు. భారతీయ సినీతారలలో ఎక్కువ మందికి క్రికెట్ అంటే పిచ్చి. ప్రపంచంలో ఏ మూలన టీమిండియా మ్యాచ్ జరిగినా ఖచ్చితంగా చూడాలనుకునేవారు, టీవీలకు అతుక్కుపోయేవారు ఎందరో.

క్రికెట్ ఒక ఆటగానే కాకుండా.. వ్యక్తులను, సమాజాన్ని, దేశాన్ని ఒక్కటిగా చేస్తుందని ఎన్నోసార్లు రుజువైంది. ఈ క్రమంలోనే ఏటా సినిమాలతోనే కాకుండా క్రికెట్‌తోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమవుతున్నారు. అదే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. భారతీయ చిత్ర పరిశ్రమలోని పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, టాప్ టెక్నీషియన్లు జట్లుగా విడిపోయి గ్రౌండ్‌లో అసలు సిసలు మజా అందిస్తున్నారు. తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మన తెలుగు వారియర్స్ జట్టు ఈసారి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ మ్యాచ్‌లు ఎప్పుడు జరగనున్నాయి? ఏయే జట్లతో మ్యాచ్‌లు జరగనున్నాయి? ఈ వివరాల్లోకి వెళితే..

Celebrity Cricket League CCL 2026 Telugu Warriors Match Schedule Dates and Opponents

సీసీఎల్ 2026లో జట్ల వివరాలు:
2011లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తొలి సీజన్ ప్రారంభమైంది. నాటి నుంచి 2025 వరకు మొత్తం 11 సార్లు సీసీఎల్ జరిగింది. భారతదేశంలో కరోనా వైరస్, లాక్‌డౌన్, ఇతర కారణాలతో 2018, 2020, 2021, 2022లలో సీసీఎల్ వాయిదా పడింది. సీసీఎల్ 2026లో చెన్నై కింగ్స్‌, పంజాబ్ దే షేర్, భోజ్‌పురి దబాంగ్స్, చెన్నై కింగ్స్, బెంగాల్ టైగర్స్, తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు బరిలోకి 2026 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సీసీఎల్ 2026 జరగనుంది. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు, జనవరి 31న సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 జరగనుండగా.. ఫిబ్రవరి 1వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం, మధురై, హైదరాబాద్‌ నగరాలు ఈసారి సీసీఎల్ 2026కు ఆతిథ్యం ఇవ్వనుంది.

తెలుగు వారియర్స్ జట్టు
అఖిల్ అక్కినేని (కెప్టెన్), ఆది సాయికుమార్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నిఖిల్ సిద్ధార్ధ, ప్రిన్స్, రోషన్ మేకా, సచిన్ జోషి, సుధీర్ బాబు, థమన్, సుశాంత్, ఖయ్యుమ్, నంద కిశోర్, రఘు, సామ్రాట్ రెడ్డి, హరీష్, సాంబా. గత సీజన్‌లో తెలుగు వారియర్స్ తన స్థాయికి తగిన విధంగా ప్రదర్శన చేయలేకపోయింది. గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. అయితే ఈసారి మాత్రం సీసీఎల్ ట్రోఫీ గెలిచి పూర్వ వైభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని దీనికి పక్కా వ్యూహం రచిస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా తెలుగు వారియర్స్ రికార్డ్ సృష్టించింది. మన జట్టు నాలుగు సార్లు సీసీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నై రైనోస్ రెండు సార్లు, కర్ణాటక బుల్డోజర్స్ రెండు సార్లు, ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ దే షేర్ జట్లు తలో ఒకసారి సీసీఎల్ ట్రోఫీ సొంతం చేసుకున్నాయి.

సీసీఎల్2026లో తెలుగు వారియర్స్ మ్యాచ్‌లు
జనవరి 16న విశాఖ వేదికగా భోజ్‌పురి దబాంగ్‌తో తెలుగు వారియర్స్ జట్టు ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత జనవరి 17న విశాఖలోనే తన రెండో మ్యాచ్‌ను పంజాబ్ దే షేర్‌తో తలపడనుంది అఖిల్ సేన. ఈ మ్యాచ్ ఆ రోజున సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం జనవరి 23న మధురైలో కర్ణాటక బుల్డోజర్స్‌తో తెలుగు వారియర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆ ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ ఎలా ఆడుతుంది? ఈసారైనా కప్ కొడుతుందా? లేదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X