CCL 2023: తమిళ హీరో చేతుల్లో దారుణంగా ఓడిన తెలుగు హీరోలు.. ఆ హీరో టెస్ట్ మ్యాచ్ అనుకున్నాడా?
2023 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇక తెలుగు వారియర్స్ ఇప్పటివరకు దూకుడుగా ఆడుతూ పాయింట్స్ పట్టికలో డామినేషన్ చూపించింది. అయితే తమిళ హీరోల టీమ్ చెన్నై రైనోస్ నుంచి వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ మ్యాచ్ ఓటమికి ఒక హీరో కారణం కావడంతో అతనిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. ఇక మొత్తంగా మన తెలుగు వారియర్స్ ఎలా ఓడిపోయారు అంటే..

చెన్నై మొదటి ఇన్నింగ్స్
10 ఓవర్లతో రెండేసి ఇన్నింగ్స్ లతో టెస్ట్ ఫార్మాట్ లో గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఇన్నింగ్స్ లో చెన్నై ప్లేయర్స్ ను 84 పరుగులకే కట్టడి చేశారు. అసలు మొదట 5 ఓవర్స్ కు తమిళ టీమ్ లో సగం మంది బ్యాట్స్ మెన్స్ వెనుదిరిగారు. ఇక అందులో కలరీ అరిసం 28(18) పరుగులు చేసి ధీటుగా నిలబడి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఇక రఘు 3 వికెట్లు, ప్రిన్స్ రెండు వికెట్లు తీశారు.
అఖిల్ తొందరగానే..
ఇక తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్ ను కూల్ గా స్టార్ట్ చేయాలని అనుకుంది. ఇక మొదటి ఓవర్ లోనే ఉహించని విధంగా అఖిల్ ఔట్ అయ్యాడు. అఖిల్ సింగిల్ డిజిట్ స్కోర్ చేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రాషన్ ఒక్కడే 56 రన్స్ చేసి టాప్ లో నిలిచాడు. తమిళ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు నిలదొక్కుకున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో పై చేయి సాధించింది తెలుగు హీరోలు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.

థమన్ 3 విక్కెట్లు
ఇక రెండవ ఇన్నింగ్స్ లో తమిళ హీరోలు మంచి స్కోర్ ను అందించారు మొదట విష్ణు విశాల్ 24 పరుగులు చేయగా ఆ తర్వాత పృద్వి 12 బంతుల్లో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్స్ గా నిలిచారు. ఇక తెలుగు హీరోలలో థమన్ మూడు వికెట్లు తీయగా నందకిషోర్ 2 వికెట్లు అందుకున్నారు. రెండవ ఇన్నింగ్స్ లో చెన్నై రైనోస్ 19 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది.
మొదట్లోనే దెబ్బ
ఇక రెండో ఇన్నింగ్స్ లో 101 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఊహించని విధంగా ఆటను స్టార్ట్ చేశారు. థమన్ , అశ్విన్ బాబు ఓపెనర్లుగా ఆటను స్టార్ట్ చేశారు. అయితే 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తెలుగు వారియర్స్ కష్టాల్లో పడింది. ఇక ఆ తరువాత సచిన్ జోషి కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. అతను 5 పరిగులకే వెనుదిరిగారు.

అఖిల్ నిలబడినా..
అనంతరం అఖిల్ అక్కినేని ఆటను కాస్త ట్రాక్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అతను 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఒకవిధంగా చెన్నై రైనోస్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉండడం వలన తెలుగు హీరోలు బాల్స్ ను బౌండరికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంతకుముందు సెంచరీ బాధిన అఖిల్ ఈ మ్యాచ్ లో 30 పరుగులు కూడా చేయలేకపోయాడు.

అతను టెస్ట్ మ్యాచ్ అనుకున్నాడా?
మొత్తానికి తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులకే ఆటను ముగించింది. తమిళ స్టార్స్ లలో విష్ణు 2 వికెట్లు అందుకున్నాడు. ఇక ప్రిన్స్ కూడా మ్యాచ్ ఒడిపోవాడనికి హీరో ప్రిన్స్ కారణం అనే కామెంట్స్ వస్తున్నాయి. 10 ఓవర్స్ మ్యాచ్ లో బంతులు తక్కువ టార్గెట్ ఎక్కువ ఉన్న సమయంలో అతను 21 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. ప్రిన్స్ మధ్యలో కాస్త దూకుడుగా మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











