Don't Miss!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నా సక్సెస్ సీక్రెట్ సినీ తారలే.. డాక్టర్ మాధవి వెంకట్ ఎమోషనల్.. సురేఖావాణి, గాయని మంగ్లీ హల్చల్
సెలబ్రిటీ సీక్రెట్స్ ఎండి డాక్టర్ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్ సెలబ్రిటీస్ సీక్రెట్‌ను డాక్టర్ మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంద్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, 'బిగ్‌బాస్' ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలో సెలబ్రిటీలందరూ హల్చల్ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాధవి వెంకట్ మాట్లాడుతూ-'' ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.
ఈ రోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీన టులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్ కంపెనీ ''సెలబ్రిటీస్ సీక్రెట్'' అన్నారు డాక్టర్ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్మెంట్ చేసేముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాక అది సక్సెస్ అయితేనే ఆ ట్రీట్మెంట్ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్ గురించి చెప్పటం వల్ల మౌత్ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు.