స్మార్ట్ ఫోన్ పిచ్చోళ్లే శంకర్ టార్గెట్.. 2.0 చిత్రంలో!
శంకర్ ప్రతి చిత్రంలో ఏదో ఒక సామజిక అంశం గురించి సందేశం ఉంటుంది. శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నవంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో శంకర్ మొబైల్ ఫోన్ల వ్యసనం గురించి ప్రభావంతంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో సెల్ ఫోన్ల వాడకం ఎంత విరివిగా పెరిగిందో అందరికి తెలిసిందే. మొబైల్ ఫోన్లకు చాలా మంది బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

హద్దులు దాటి మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే ఇటివంటి సైబర్ నేరాలు చోటు చేసుకుంటాయి శంకర్ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజని నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించాడు. అమీజాక్సన్ హీరోయిన్. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 500 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











