Hai Nanna: నానికి సెన్సార్ బోర్డు షాక్.. ఈ బూతు డైలాగ్‌తో పాటు ఆ సీన్ కట్
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ ఇప్పుడు తమ చిత్రాలతో రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్నారు. ఇలా బహుభాషా చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదగాలని చూస్తున్నారు. అందులో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడనే చెప్పాలి. ఆరంభం నుంచీ తెలుగు భాషకే పరిమితం అయిన అతడు.. ఈ మధ్య కాలంలో భారీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు.
'దసరా'తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తన 30వ సినిమాను శౌర్యూవ్ అనే దర్శకుడితో చేస్తున్నాడు. 'హాయ్ నాన్న' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్‌తో రాబోతుంది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లోనే నెలకొన్నాయి.

నాని నటిస్తున్న 'హాయ్ నాన్న' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మిగిలినవి కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'హాయ్ నాన్న' మూవీని డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వీక్షించిన తర్వాత సెన్సార్ సభ్యులు దీనికి యూ (U) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక, ఈ చిత్రం 155 నిమిషాలు అంటే 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'హాయ్ నాన్న' మూవీ సెన్సార్ రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో హీరోయిన్ బ్యాక్‌ను చూపించినట్లు తెలిసింది. దీని స్థానంలో మరో షాట్ కలిపినట్లు సమాచారం. అలాగే, ఈ చిత్రంలో వచ్చే F పదంతో వచ్చే బూతును కూడా మ్యూట్ చేసినట్లు రిపోర్టు ద్వారా లీకైంది.
ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











