అఖిల్ 'ఏజెంట్'కు సెన్సార్ కోతలు.. హైలెట్ సీన్లకే అలా.. మరి సినిమా రిజల్ట్?
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. మనం సినిమాలో గెస్ట్ రోల్ తో అట్రాక్ట్ చేసిన అఖిల్ తర్వాత మంచి స్టార్ అవుతాడని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా అతను హీరోగా చేసిన తొలి సినిమా అఖిల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
తర్వాత వరుసగా చిత్రాలన్ని నిరాశ పరిచాయి. ఇప్పుడు అక్కినేని అభిమానుల అఖిల్ ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఏజెంట్ సినిమాలోని ప్రధాన సన్నివేశాలు కోతకు గురయ్యాయి.

మనం కెమియో రోల్ తర్వాత అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ప్లాప్ అయి అక్కినేని అఖిల్ కు దెబ్బ మీద దెబ్బ చూపించాయి. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు సాలిడ్ హిట్, స్టార్ డమ్ ను ఎలాగైన తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఏజెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పాపులర్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిచాడు. హీరోయిన్ గా సాక్షి వైద్య తన గ్లామర్ తో అట్రాక్ట్ చేయనుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఏజెంట్ సినిమా విడుదల కానుంది.
ఏజెంట్ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్' (CBFC) ఏజెంట్ సినిమాపై 8 చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెగ్యులేటరీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా లేకపోవడంతో సినిమాలోని కొన్ని బూతు పదాలను మ్యూట్ చేశారు.
అంతేకాకుండా ప్రేక్షకులపై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడకుండా రెండు వయెలన్స్ సీన్లను బ్లాక్ చేశారట. ఈ సినిమాలో ప్రధానంగా నిలిచే యాక్షన్ సీన్స్ ఇలా బ్లాక్ చేయడం ఏజెంట్ కు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ రాగా 156 నిమిషాలుగా నిడివి ఉంది.

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మఖ్య అతిథిగా నాగార్జున హాజరైన విషయం తెలిసిందే. వరంగల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల్ కు చిన్నప్పుడే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవని, దాని వల్ల చాలా ఇబ్పంది పడినట్లుగా నాగార్జున తెలిపారు.


Click it and Unblock the Notifications











