twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్‌ ‘రణరంగం’కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. ప్రపంచవ్యాప్తంగా15న రిలీజ్.. నాగవంశీ

    |

    యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. సెన్సార్ పూర్తి ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... ఈ రోజు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. ఆగస్టు 15 న 'రణరంగం' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాకినాడలో ప్రేక్షకాభిమానుల సమక్షంలో విడుదలైన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు సుధీర్ వర్మ 'రణరంగం' ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది అనే నమ్మకముంది అని అన్నారు.

     Censor Clears Sharwanands Ranarangam movie

    'గ్యాంగ్ స్టర్' గా ఈ చిత్రం లో కథానాయకుడు శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుంది. 'గ్యాంగ్ స్టర్' చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ 'రణరంగం'. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ 'గ్యాంగ్‌స్టర్' పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిని పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయిన చిత్రం ఆడియోకు కూడా మంచి స్పందన లభించింది. ప్రేక్షకులు కూడా ఈ నూతన 'గ్యాంగ్‌స్టర్' చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

     Censor Clears Sharwanands Ranarangam movie

    మాటలు: అర్జున్ - కార్తీక్,
    సంగీతం : ప్రశాంత్ పిళ్ళై ,
    ఛాయాగ్రహణం: దివాకర్ మణి,
    పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,
    ఎడిటర్: నవీన్ నూలి,
    ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,
    పోరాటాలు: వెంకట్,
    నృత్యాలు: బృంద, శోభి,శేఖర్,
    ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
    సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
    నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
    రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

    English summary
    uryadevara Naga Vamsi, the producer of the film said, "We are highly confident about the movie and Sudheer Varma did his best in this one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X