శైలజారెడ్డి అల్లుడు సెన్సార్ కంప్లీట్.. వినాయక చవితికి రెడీ!
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. అను ఇమ్మాన్యుయేల్ హెరాయిన్ గా నటించగా, సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ నాగ చైతన్యకు ఈ చిత్రంలో అత్తగా నటించింది. ఈ ముగ్గురి మధ్య సాగే కథని దర్శకుడు మారుతి వినోదాత్మక అంశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మారుతి చిత్రాల్లో వినోదానికి పెద్ద పీట ఉంటుంది.
విడుదలకు ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. తాజగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని సైతం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు.

ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కమెడియన్ పృథ్వీ, వెన్నెల కిషోర్ నటన ఈ చిత్రానికి మరో ఆకర్షణ. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13 న వినాయక చవితి కానుకగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











