సెన్సార్ పూర్తి చేసుకున్న దేవదాస్.. నాగ్, నాని మల్టీస్టారర్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ!
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు దేవదాస్ చిత్రానికి యూ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. నాని డాక్టర్ గా, నాగార్జున డాన్ గా ఈ చిత్రంలో నటించారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో దేవదాస్ చిత్రం ఆసక్తిరేకెత్తిస్తోంది. నాగార్జున, నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా వినోదాత్మకంగా ఉండబోతున్నాయని టీజర్స్, ట్రైలర్స్ ద్వారా అర్థం అవుతోంది.

ఆకాంక్ష సింగ్, రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే అలరిస్తోంది. సెప్టెంబర్ 27 న దేవదాస్ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











