టాక్సీవాలా సెన్సార్ పూర్తి.. ఇక అంతా సిద్ధం అంటున్న విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. ఈ ఏడాది ఇప్పటికే గీత గోవిందం, నోటా వంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు టాక్సీవాలా చిత్రం నవంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. టాక్సీవాలా చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. రాహుల్ దర్శత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

విజయ్ దేవరకొండకు జోడిగా డెబ్యూ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ నటిస్తుండడం విశేషం. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వచ్చిన నోటా చిత్రం నిరాశపరిచింది. దీనితో టాక్సీవాలాపై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
taxiwala vijay devarakonda tollywood geetha govindam priyanka jawalkar టాక్సీవాలా విజయ్ దేవరకొండ టాలీవుడ్


Click it and Unblock the Notifications