twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీ కంటెంట్‌పై నిఘా.. ఇకపై అలాంటివి కుదరదు!

    |

    ఇప్పటి వరకు సినిమాలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ ఇకపై ఓటీటీకీ వర్తించబోతోంది. ఓటీటీ కంటెంట్, డిజిటల్ న్యూస్ సంస్థలు, సోషల్ మీడియాకి కూడా కొన్ని నియమ నిబంధనలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకుని రాబోతోందట. సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్ సంస్థలు, ఓటీటీ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండాల్సిందే. ఇండియా సమగ్రతను దెబ్బతీసేలా వచ్చే కంటెంట్‌ను పూర్తిగా నిలిపేవేసేలా చర్యలు తీసుకోబోతోన్నారట.

    అయితే వీటికోసం ఇతర మంత్రిత్వ శాఖలన్నీ కలిసి పని చేస్తాయని ఐటీ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో భాగంగా డిఫెన్స్, విదేశాంగ, హోం, ప్రసార శాఖ, ఐటీ, మహిళ శిశు సంక్షేమ శాఖలన్నీ కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. అయితే ఇకపై సోషల్ మీడియాలో జాతికి వ్యతిరేకంగా వచ్చే పోస్ట్‌లు, ఓటీటీ కంటెంట్‌లపై కేంద్రం నిఘా వేయబోతోంది.

     Central Government ott and social media regulations

    అయితే ఇలాంటి తరుణంతో ఓటీటీ కంటెంట్‌కు కత్తెర వేయడం, సోషల్ మీడియాను అదుపులో పెట్టడం సాధ్యమయ్యే పనేనా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు పూర్తిగా ఆచరణలోకి వస్తుందో చూడాలి. ఒక వేళ అదే జరిగితే సోషల్ మీడియాలో, డిజిటల్ న్యూస్ సంస్థలు, ఓటీటీల్లో కంటెంట్ పరంగా ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

    ఇందులో ప్రధానంగా.. పరువునష్టం, అశ్లీలత, జాతి వివక్ష, మైనర్స్‌కు హాని కలిగించే కంటెంట్.. దేశ ఐక్యతకు భంగం, సమగ్రతకు నష్టం వాటిల్లే.. త్రివిధ దళాలు, భద్రత వంటి అంశాలకు వ్యతిరేకంగా వచ్చే కంటెంట్‌ను జల్లెడ వేయడం. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తరువాత 36 గంటల్లోనే ఆ కంటెంట్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుందట.

    English summary
    Central Government ott and social media regulations,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X