HanuMan: తేజ సజ్జాను సర్‌ప్రైజ్ చేసిన కేంద్ర మంత్రి.. హనుమాన్‌పై ఊహించని వ్యాఖ్యలు
పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సినిమానే అయినా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అయింది 'హానుమాన్'. తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే సంక్రాంతి బరిలో దూకిన ఈ మూవీ.. ఏకంగా భారీ ఆదరణను సొంతం చేసుకుని ఈ పొంగల్ సీజన్‌కు విన్నర్‌గా నిలిచింది.
సూపర్ హీరో నేపథ్యంతో క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా దీనికి వసూళ్లు పోటెత్తాయి. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను అందుకుంటోంది.
Recommended Video


తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు చాలా రంగాల ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఎంతో మంది పొలిటీషియన్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి 'హనుమాన్' మూవీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు.
'హనుమాన్' మూవీ హీరో తేజ సజ్జా సినిమా ప్రమోషన్ కోసం న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఈ యంగ్ హీరో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ విషయాన్ని తాజాగా కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ భేటీలో 'హనుమాన్' మూవీ విజయం సాధించిన సందర్భంగా తేజ సజ్జాను ఆయన సన్మానించారు.
తేజ సజ్జాను సన్మానించిన ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'న్యూ ఢిల్లీలో హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జాను కలవడం సంతోషంగా ఉంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. అయోధ్యలోని భవ్య రామ మందిరానికి ఒక్కో టికెట్‌పై రూ. 5 దానం చేయడం ద్వారా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవంలో మీరు కూడా భాగం అయ్యారు' అని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.


Click it and Unblock the Notifications











