నాలుగు పీకీ ఇక్కడ పడుకోబెడితే.. కార్తికేయకు హీరోయిన్ పంచ్.. అయినా పులిహోర కలపడం ఆపలేదు
టాలెంట్ ఎంత ఉన్నా కూడా కొంతమంది నటీనటులు ఒక స్టేజ్ వరకే ఆగిపోతున్నారు. ముఖ్యంగా యువ హీరో హీరోయిన్స్ ఫెయిల్యూర్స్ అందుకోగానే వెనుకబడిపోతున్నారు. అలాంటి వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. అందంతో నటనలో ఈ హీరోయిన్ కు మంచి మార్కులే పడుతున్నాయి గాని బాక్సాఫీస్ వద్ద సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. ఇక ఈ సారి 'చావు కబురు చల్లగా సినిమాతో' హిట్ కొట్టేలా ఉందని అనిపిస్తోంది. అయితే హీరోకు లావణ్య కౌంటస్ ఇవ్వడం వైరల్ గా మారింది.

ఆశలన్నీ ఆ సినిమాపైనే
లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనంతరం ఆమె చేసిన కొన్ని సినిమాలు అప్పుడప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. అయితే బ్యాక్ టూ బ్యాక్ కొన్ని డిజాస్టర్స్ రావడం అమ్మడి కెరీర్ ను కొంచెం డౌన్ అయ్యేలా చేశాయి. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ ' చావు కబురు చల్లగా' అనే సినిమాపైనే పెట్టుకుంది.
ఆకట్టుకుంటున్న టీజర్
కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అయితే అందులో మార్చురీ వ్యాన్ డ్రైవర్ బస్తి బలరాజు అనే పాత్రలో నటిస్తున్నాడు కార్తికేయ. ఇక లావణ్య త్రిపాఠి హాస్పిటల్ లో సిస్టర్ గా నటిస్తోంది. టీజర్ లో కార్తికేయ చాలా సరదాగా హీరోయిన్ వెంట పడుతూ కనిపిస్తున్నాడు.

నాలుగు పీకీ ఇక్కడ పడుకోబెడితే..
ఇక సోషల్ మీడియాలో వీరిద్దరూ టీజర్ కు తగ్గట్లుగానే ప్రమోషన్ చేస్తున్నారు. మనం ప్రేమించిన అమ్మాయి మనకు తప్ప మిగిలిన వారందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతో ఉందొ.. అది సూపర్ అంటూ ట్వీట్ చేసి మరీ చెప్పాడు కార్తికేయ. ఇక లావణ్య స్పందిస్తూ.. నాలుగు పీకీ ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ నే అవుతాను అంటూ.. కౌంటర్ ఇచ్చింది.
Recommended Video

అంత ముద్దుగా తిట్టకే అంటూ..
సినిమాలో డైలాగ్స్ కు తగ్గట్టుకుగా ఇద్దరు సోషల్ మీడియాలో బాగానే రచ్చ చేశారని అనుకుంటుండగా కార్తికేయ మాత్రం కొంచెం కూడా తగ్గకుండా టీజర్ లో చూపించని డైలాగ్స్ వాడినట్లు అర్ధమవుతోంది. లావణ్య అల అనగానే.. అయ్య బాబోయ్ అంత ముద్దుగా తిట్టకే అంటూ ట్వీట్ వేయడంతో పులిహోర కలుపుతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











