75 లక్షల బడ్జెట్.. 7 కోట్ల లాభం.. అందుకే దర్శకులకు అండగా.. నిర్మాత చదలవాడ
తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు మనుగడ లేకుండా పోతున్నదనే ఆవేదన నిర్మాత, దర్శకుల నుంచి వస్తున్నది. మంచి కంటెంట్‌తో సినిమాలు ఆదరిస్తున్న పరిస్థితుల్లో చిన్న సినిమా రిలీజ్‌కు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నది. దాంతో పలువురు దర్శకులు అవకాశాల్లేకుండా సమస్యల్లో ఉన్నారు. అయితే ప్రతిభ ఉండి అవకాశాలు లేని దర్శకులను ఆదుకోవడానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో చిన్న బడ్జెట్ చిత్రాలు తీయడానికి తాను సహకారం అందిస్తాననే సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ సంచలన నిర్ణయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
టీఎఫ్‌డీఏ సమావేశంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సినిమా పట్ల అంకితభావాన్ని నిరూపించుకొన్నారు. 30 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి 10 మంది దర్శకులకు అవకాశాలు ఇస్తాను. ఒక్కో చిత్రానికి 3 కోట్ల రూపాయలు కేటాయించి పది మందితో 10 సినిమాలు తీస్తాను అని తన ప్లాన్‌ను వివరించారు. చదలవాడ నిర్ణయంపై డైరెక్టర్స్ అసోసియేషన్ స్వాగతం పలకడంతోపాటు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఎన్నో ఏళ్ల నుంచి మీడియాకు సపోర్ట్‌గా నిలిచింది. నాకు కొందరిలా పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాత్రం ఈ ప్రకటన నా ద్వారానే జరగాలని ఆశించారు. అందుకే ఈ సమావేశంలో నేను ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది అని తన విజన్‌ను మీడియా ముందు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించలేకపోయినా.. కళామతల్లికి సేవ చేశాననే తృప్తి ఉంటుంది. ఆ సేవతో సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది అని అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్లు ఏఎన్నాఆర్, శోభన్‌బాబు లాంటి ప్రముఖులతో చాలా సినిమాలు తీశాను. ఈ ప్రయాణంలో దర్శకుడు అజయ్ నాకు సన్నిహితంగా మారారు. ఆయనతో 75 లక్షలతో జీవిత ఖైదు అనే సినిమా తీశాను. ఆ సమయంలో నాకు ఏడు కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అప్పట్లో కేవలం 40 రోజుల్లో సినిమా పూర్తి చేసే వాళ్లం. ఇప్పటి ఇండస్ట్రీ కంటే అప్పటి ఇండస్ట్రీ అంటేనే నాకు ఇష్టం అని చదలవాడ అన్నారు.
సినిమా పరిశ్రమలో అప్పటి హీరోలు శోభన్ బాబు, ఏఎన్నాఆర్ లాంటి హీరోల నుంచి పూర్తి సహకారం ఉండేది. ప్రస్తుతం పరిశ్రమలో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్లు మూతపడుతున్నాయి. సత్తా, ప్రతిభ ఉన్న నిర్మాతలు, దర్శకులకు తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా నిలువాలని అనుకొంటున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియ్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు అని చదలవాడ అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు.


Click it and Unblock the Notifications