Niharika Konidela విడాకుల ఇష్యూను అలా వాడుకోవద్దు.. నిహరిక కామెంట్స్‌పై మాజీ భర్త సీరియస్

మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజేయంద్ర సింహతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఆ వీడియోలో భర్తతో విడాకులపై మొదటి సారిగా నోరువిప్పింది. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ విషయం తెలుసుకున్న నిహారిక మాజీ భర్త జోన్నలగడ్డ చైతన్య తొలిసారిగా రియాక్ట్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే....

నాగ బాబు డాటర్ నిహారిక కొణిదెల.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అయితే ఆ వివాహం ముణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోయింది. గత ఏడాది వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే... విడాకుల తర్వాత ఎన్నో సార్లు ఎన్నో రూమర్స్ వచ్చిన నిహారికా నోరు విప్పలేదు. తాజాదా తన ఫ్రెండు యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఆ ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై నోరు విప్పింది.

 Chaitanya Jonnalagadda Responds on Niharika Konidela Interview With Nikhil Full Details Here

ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. అది జరుగకపోతే మనకు సెట్‌ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదని చెప్పుకువచ్చింది వాళ్లు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరని... ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరని వెల్లడించింది. తనది పెద్ద‌లు కుదిర్చిన సంబంధం అయినప్పటికీ... విడాకులు తీసుకున్న స‌మ‌యంలో నన్ను చాలా మాటలు అనడంతో బాధ తట్టుకోలేక ఎంతో ఏడ్చానని చెప్పుకువచ్చింది.

అలాంటి వాటిని భ‌రించ‌డం అంత ఈజీ కాదన్న మెగా డాటర్... మా ఇద్దరికి సెట్ అవ్వలేదు కాబట్టే విడిపోయామని బయటపెట్టింది నిహారిక. ఈ రెండేళ్లలో కుటుంబ విలువ తెలిసింది.. పెళ్లి-విడాకుల త‌ర్వాత ఎవ‌ర్నీ న‌మ్మ‌కూడ‌ద‌ని అర్దమైందని చెప్పుకువచ్చింది. ఇక తన వయసు 30 కాగా... మంచి వ్యక్తి ఎదురుపడితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ విషయం ఆమె మాజీ భర్త చైతన్య జోన్నలగడ్డ స్పందించాడు.

 Chaitanya Jonnalagadda Responds on Niharika Konidela Interview With Nikhil Full Details Here

త సోషల్ మీడియా వేదికగా చైతన్య సుదీర్ఘ సందేశం రాసుకువచ్చారు. అందులో నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగిటివిటీ దూరం చేయడానికి నిఖిల్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ నెగిటివిటీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తనకు తెలుసు అంటూ రాసుకువచ్చారు. వివాహానికి సంబంధించి బాధితురాలి ట్యాగ్‌లను పరోక్షంగా అటాచ్ చేయడానికి రీచ్, ప్లాట్‌ఫారమ్స్ ను ఉపయోగించడం మానేయాలని సూచించాడు.

ఇలా జరగడం ఇది రెండోసారి... పెళ్లి అయ్యాక సెట్ కాకపోతే వచ్చే బాధ... దాని నుంచి బయట పడడం ఇద్దరికీ ఒకేలా ఉంటుందన్న చైతన్య.... విడాకుల గురించి అది పూర్తయ్యాక మాట్లాడకూడదని తెలిపారు. మరీ ముఖ్యంగా ఒకరి వైపు నుంచే మాట్లాడడం అసలు కరెక్ట్ కాదన్నారు. అయితే పెళ్లి విఫలం అయితే వచ్చే పెయిన్ గురించి... దాని నుంచి బయటపడడం గురించి మాట్లాడవచ్చని చెప్పుకువచ్చాడు.

 Chaitanya Jonnalagadda Responds on Niharika Konidela Interview With Nikhil Full Details Here

ఎందుకంటే అది వేరొకరికి ఉపయోగపడచ్చని సూచించాడు చైతన్య.. భవిష్యత్తులో ఇలా ఇంటర్వ్యూ చేసేప్పుడు, నిజం తెలుసుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఇద్దరినీ పూర్తిగా విచారించి టైమ్‌ లైన్ తెలుసుకుని అప్పుడే మాటలు మాట్లాడాలని రాసుకువచ్చాడు. కానీ పూర్తిగా విషయం తెలియకుండా ప్రజలకి తీర్పు చెప్పడం అన్యాయమని నేను భావిస్తున్నట్లు తెలిపాడు. అది తప్పు అయితే, నాణేనికి ఒక వైపు నుండి ఈ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించుకుని పరోక్ష సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించడం కూడా అంతే తప్పు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X