Niharika Konidela నిహారిక కొణిదెల రెండో పెళ్లి... షాకింగ్ పోస్ట్ పెట్టిన మాజీ భర్త

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జేవీ చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. దానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ... తాజాగా తాను రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రకటించింది. ఆమె ప్రకటించిన తర్వాత మాజీ భర్త చైతన్య షాకింగ్ పోస్ట్ పెట్టారు. అసలు చైతన్య పెట్టిన పోస్ట్ ఏంటి.. అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.

నిహారిక కొణిదెల...
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల.. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. ఇక పెద్దల సమక్షంలో చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. క్యూట్ కపుల్స్ లో వీరు ఒకరు పేరు తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు.. గత ఏడాది సైలెంటుగా విడాకులు తీసుకుని షాకిచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చాలా కంగారుపడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.

Chaitanya JV Shocking Post After Niharika Konidela Says Second Marriage News Full Details Here

రెండోపెళ్లంటూ..
మరోవైపు నిహారిక గతంలో పాడ్ కాస్ట్ లో తన విడాకుల గురించి చెప్పుకువచ్చింది. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్‌ చేయరని పాడ్ కాస్ట్ లో తెలిపింది. అయితే అప్పుడు సైతం ఆమె మాటలు వైరల్ గా మారాయి. దీనిపై జోన్నలగడ్డ చైతన్య సైతం స్పందించి.. విడాకులు రెండు మనుషుల మధ్య విషయం.. దాన్ని పబ్లిక్ గా మాట్లాడకూడదని లా పాయింట్స్ మాట్లాడాడు.

పిల్లలు కావాలంటూ...
ఇక తాజాగా మరోసారి నిహారిక తన రెండో పెళ్లి గురించి చెప్పుకువచ్చింది. తనకు పిల్లలంటే ఇష్టం... పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పుకువచ్చింది. ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదన్న నిహారిక... ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రెండో పెళ్లి అయితే చేసుకుంటాను.. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు అంటూ చెప్పుకువచ్చింది. ఈమె వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Chaitanya JV Shocking Post After Niharika Konidela Says Second Marriage News Full Details Here

మాజీ భర్త పోస్ట్...
ఇక ఈ విషయం పక్కన పెడితే.. నిహారిక కొణిదెల రెండో పెళ్లిపై మాట్లాడిన తర్వాత చైతన్య జేవీ ఓ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు. ఆ నోట్ కచ్చితంగా నిహారిక కోసమే అంటున్నారు నెటిజన్స్.ఆ నోట్ లో సుదీర్ఘ కవిత లాంటి పదాలను పోస్ట్ చేశాడు. అందులో... విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, మీరు నీటి అడుగున ఉన్నప్పుడు మీరు అనుభవించే నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి మిమ్మల్ని ఆవరించే నిశ్శబ్దం, చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో నిశ్శబ్దం అంటూ రాసుకువచ్చాడు.

ఎందుకో మరి...
మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే నిశ్శబ్దం, నిశ్శబ్దం మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది. మీ భౌతిక రూపం నుండి విముక్తి పొందండి మరియు అదే నిశ్శబ్దం భగవంతుడికి ఒక మాధ్యమం అని మీరు కనుగొంటారు... నిశ్శబ్దం.. చైతన్య జెవి అంటూ రాసుకువచ్చాడు. అసలు ఈ నోట్ ఎవరి కోసం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X