స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. ఎప్పుడో చెప్పి షాకిచ్చిన టిల్లు బ్రదర్!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గరుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన ఆయన డీడే టిల్లు సినిమాతో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఒక్క సినిమాతోనే ఆయన కెరియర్ గ్రాఫ్ పెరిగిపోగా... ఇప్పుడు దీనికి సీక్వెల్ సినిమా చేస్తున్నారు.
అయితే ఈయన సోదరుడు చైతన్య జొన్నలగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టిల్లు గాడి పెళ్లి గురించి చెప్పాడు. ఆయన ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో అవవాలని సినీ రంగంలో అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ ముందుగా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు హీరో పక్కన సైడ్ రోల్స్ కూడా చేశారు. జోష్, ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, బాయ్ మీట్స్ గర్ల్, గుంటూర్ టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి మంచి మంచి చిత్రాలు చేశారు. కానీ డీజే టిల్లుతో సూపర్ సక్సెస్ సాధించి స్టార్ హీరోగా మారిపోయాడు.
ప్రస్తుతం డీజే స్క్వేర్ సినిమా చేస్తున్న ఈయన మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు, నటుడు చైతూ జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సోదరుడి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా సిద్ధుకు డీజే టిల్లు సినిమా ముందే వచ్చి ఉంటే మరోలా ఉండేదని చెప్పారు. అలాగే తాను కూడా సినిమాలు చేస్తున్నానని.. బబుబ్ గమ్ సినిమాలో చేశానని అన్నారు.
అయితే సిద్ధు సోదరుడిని అని వరికీ చెప్పకుండానే సినీ రంగంలో కొనసాగుతున్నానని.. చైతు జొన్నలగడ్డ వివరించారు. అయితే సిద్ధు ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడట.. కదా నిజమేనా అంటూ యాంకర్ అడగ్గా.. ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పారు. అవునని వివరించారు. సిద్ధు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని తెలిపాడు. అయితే నెక్స్ట్ ఇయర్ అలా పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందంటూ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











