#HBDManiSharma : చలాకీ చిన్నమ్మీ అంటూ నారప్ప నుంచి స్పెషల్ ట్రీట్!

స్వర బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన సంగీతం అందిస్తున్న నారప్ప సినిమా నుంచి ఒక అద్భుతమైన లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఆ సినిమా దర్శక నిర్మాతలు. 1992లో రాత్రి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మణిశర్మ అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. అనేక సినిమాలకు మ్యూజిక్ అందించిన ఆయన వద్ద దేవిశ్రీప్రసాద్, ఎస్ ఎస్ తమన్, హారిస్ జయ రాజు వంటి వారు శిష్యరికం చేశారు. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నారప్ప సినిమా నుంచి ఒక సింగిల్ రిలీజ్ చేశారు. 'చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది'..అంటూ సాగే ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ అనే సినిమాని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమాలో తెలుగులో వెంకటేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. వెంకటేష్ భార్యగా ప్రియమణి, కుమారుడిగా కార్తీక్ రత్నం, బావమరిదిగా రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం అనంతపురం నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా ద్వారా మళ్లీ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

 Chalaki Chinnammi song release from Narappa on Manisharma Birthday

దీంతో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలే పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా థియేటర్లలో వస్తుందని అందరూ భావిస్తుండగా సురేష్ బాబు ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ డీల్ ఇప్పటికే ఫైనల్ చేశారని అంటున్నారు.. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పటికే తమ టెలివిజన్ యాడ్స్ లో కూడా నారప్ప ఎక్స్ క్లూజివ్ గా తమ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. అయితే తెలంగాణ ఫిలిం చాంబర్ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కు తగ్గుతారు అని భావించినా అదేమీ లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X