జబర్దస్త్ చమ్మక్ చంద్రను అలా చూసి షాకైన బ్రహ్మానందం! ఇదీ అసలు సంగతి
Recommended Video
బుల్లితెరపై భారీ పాపులారిటీ తెచ్చుకున్న షో జబర్దస్త్. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్వించడం ఈ షో ప్రత్యేకత. ఇక ఈ షోలో స్కిట్లు వేసే కమెడియన్స్ అయితే ఆయా సన్నివేశాల్లో మామూలుగా జీవించరు. స్కిట్ వేస్తున్నంత సేపు నవ్విస్తూనే క్యారెక్టర్‌లో లీనమైపోతుంటారు. ఇదే వీళ్లకు భారీ ఫాలోయింగ్‌తో పాటు వెండితెర అవకాశాలు కూడా తెచ్చిపెడుతోంది.

గతంలో కొందరు.. ఇప్పుడు చమ్మక్ చంద్ర
జబర్దస్త్ షో కమెడియన్ స్థాయి నుంచి వెండితెర హీరోగా ఎదిగిన వాళ్లలో ఒకరు షకలక శంకర్. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన సినిమాలు విడుదలై ఆడియన్స్ టాక్ రుచి చూశాయి. ఇక ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నాడు మరో జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర. ఈయన హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రామసక్కనోళ్లు'.

చిన్న స్థాయి నుంచి హీరోగా ప్రమోట్
చమ్మక్ చంద్ర గతంలోనే వెండితెర గడప తొక్కాడు. కానీ చిన్న సినిమాల్లో కనిపించడం, అది కూడా చిన్న కామెడీ సీన్‌తో నవ్వించడం వరకే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం హీరోగా ప్రమోట్ అయి 'రామసక్కనోళ్లు' అంటూ వెండితెర ఆడియన్స్‌ని పలకరించ బోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఉంది.
జబర్దస్త్ ట్రైలర్.. చమ్మక్ చంద్ర రొమాన్స్
తాజాగా 'రామసక్కనోళ్లు' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో చమ్మక్ చంద్రతో పాటు బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్ కూడా కనిపించడంతో అంచనాలు పెరిగాయి. పైగా హీరోయిన్ అందాల విందు, దానికి తోడు ఆమెతో చమ్మక్ చంద్ర రొమాన్స్ హైలైట్ చేయడంతో యూత్ ఆడియన్స్ ఆకర్షితులవుతున్నారు. చమ్మక్ చంద్ర రొమాన్స్ చూసి షాకైన బ్రహ్మానందం సీన్ కడుపుబ్బా నవ్విస్తోంది.

రామసక్కనోళ్లు మూవీ
గ్రామీణ నేపథ్యంలో రాబోతోంది 'రామసక్కనోళ్లు' మూవీ. సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీష్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నాడు. మేఘన రెడ్డి హీరోయిన్. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో జబర్దస్త్ కమెడియన్స్ ధన్‌రాజ్, వేణు సహా బ్రహ్మాజీ, సాయాజి షిండే, బ్రహ్మానందం లాంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











