NBK109: బాలయ్య మూవీలో తెలుగు హీరోయిన్.. మరో స్టార్ హీరోకు జోడీగా!
ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'అఖండ'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. వరుసగా 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి సక్సెస్‌లను అందుకున్నారు. దీంతో ఇప్పుడు మరో ప్రాజెక్టులను చేస్తున్నారు.
కెరీర్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందిస్తోన్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా వరకూ పూర్తి అయింది. ఇప్పుడు కూడా దీన్ని శరవేగంగా జరుపుతున్నారు. వీలైనంత త్వరగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా శ్రమిస్తోంది.
బాబీ - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖులను భాగం చేశారని అంటున్నారు. అలా ఈ చిత్రం కోసం ఇప్పటికే ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ వంటి స్టార్లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి కూడా ఓ పాత్ర చేస్తుందట.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్యతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అతడికి జోడీగానే తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి నటిస్తుందని తెలిసింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. చాందినీ ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. బాబీ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్టుతో.. బాలయ్య మార్క్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలైలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











