"చాందిని చౌదరిని గెస్ట్ హౌజ్‌కు రమ్మన్నా.. ఎక్కడున్నానో తెలుసుని వచ్చి మరీ కొట్టింది"
చాందిని చౌదరి.. అచ్చమైన తెలుగు హీరోయిన్ అయిన ఈమె గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో రచ్చ చేసే ఈమె.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు హీరోయిన్ గా కూడా మారిపోయిందీ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈమె గురంచి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకరు.. చాందిని చౌదరికి ఫోన్ చేసి గెస్ట్ హౌజ్ కు రమ్మని పిలిచారట. లేదంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారట. ముందుగా ఫుల్ గా ఏడ్చేసిన ఈమె ఆ తర్వాత వారి గురించి తెలుసుకుని వచ్చి మరీ చెంప పగులగొట్టిందట. ఆ స్టోరీ ఏంటి, అసలు చాందిని గెస్ట్ హౌజ్ కు రమ్మన్నది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే గామి సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన చాందిని చౌదరి.. తనకు తగ్గ పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ మాత్రమే సినిమాలు చేస్తోంది. తనకు వచ్చిన వాటిల్లో మంచి వాటిని వెతుక్కుంటుంది తప్పితే ఏవి పడితే అవి చేయట్లేదు. అయితే కొన్నాళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మకు.. ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. నీవు రేపు గెస్ట్ హౌజ్ కు రాకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ తెలిపారట. అయితే ఈ మెసేజెస్ చూసిన చాందిని ఏం చేయాలో తెలియక బాగా ఏడ్చేసిందట.
అయితే ఆమె ఏడుపు చూసిన.. టాలీవుడ్ టామ్ బాయ్ నటి స్నిగ్ధ వెంటనే స్పందించి.. నీపై ప్రాంక్ చేసింది నేనేనని చెప్పిందట. నేనే కావాలని, ఆట పట్టించాలని ఇలా చేశానని చెప్పగా.. ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అంటూ అడిగిందట. తానున్న ప్లేస్ చెప్పగానే వెళ్లి తన చెంప పగులగొట్టిందట. అయితే ఇదంతా చాలా రోజుల క్రితమే జరగినప్పటినీ.. నటి స్నిగ్ధ ఇటీవలే వెల్లడించింది. ముఖ్యంగా తాను దావత్ షోలో పాల్గొనగా నోటిదూల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నావా అనగానే స్నిగ్ధ ఈ స్టోరీ చెప్పుకొచ్చింది.

ఇది మాత్రమే కాకుండా హీరో సిద్ధార్థ్ తో అమ్మాయిలా చాటింగ్ చేసి, డేటింగ్ కు వస్తావా అని అడిగినట్లు కూడా చెప్పింది. ఎక్కడికెళ్దాం అని హీరో అడగ్గా.. నేరుగా ఇంటికొచ్చెయ్ రా మావా అంటూ ఫోన్ చేసి చెప్పానని ఫన్నీ ఇన్సిడెంట్ గురించి వివరించింది. ప్రస్తుతం స్నిగ్ధ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మీరు కూడా ఓసారి దావత్ షో లేటెస్ట్ ప్రోమో చూసేయండి.


Click it and Unblock the Notifications











