twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రోదయం షూటింగ్ పూర్తి.. ఆకులెన్నీ కాలినా బొగ్గులు కావు.. బాబు బయోపిక్‌లో

    |

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం" చంద్రోదయం". ఈ బయోపిక్‌ను పీ వెంకటరమణ దర్శకత్వంలొ జీజే రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడుని యూనిట్ కలిసింది.

    ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. "ఆకులెన్నీ కాల్చిన బొగ్గులు కావు బ్రదర్ . జిత్తులమారి నక్కలు , తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు , మృగరాజు మాత్రమే" అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్‌తో షూటింగ్ విజయవాడలో పూర్తి అయ్యింది.

     Chandra babu Biopic Chandrodayam shooting finished

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలొనె ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాం. చిత్రీకరణ పూర్తిచేశాం. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్దాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నామని"న్నారు.

    నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ..నారా వారి పల్లె, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లో సినిమా షూటింగ్ చెశాము. మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2 వ వారంలొ విడుదల చేయనున్నాం. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

    వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

    English summary
    After Mahanati. Now, one more biopic is lined-up, which is set to hit the screens on October 18. The biopic is titled Chandrodayam. It will showcase the journey and growth of Chandrababu Naidu as a politician. While Vinod Nuvvula will portray the titular character. Bhaskar will essay the role of his father senior NT Rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X