ఏపీలో పవన్ సునామీ వల్లే చారిత్రాత్మక విజయం.. ప్రభుత్వంలో కీలక పదవి.. హింట్ ఇచ్చిన చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. జూన్ 12వ తేదీన కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో సుమారు 12 ఎకరాల మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాల్లోకి వెళితే..
అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి హాజరయ్యారు. నేతల ప్రసంగాలు భావోద్వేగంగా సాగాయి. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆలింగనం చేసుకొన్న తర్వాత సమావేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది కళ్లు చెమర్చాయి.

ఇక చంద్రబాబును దగ్గరగా తీసుకొని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరి గుండెను తాకాయి. చంద్రబాబును కౌగిలించుకొన్న తర్వాత మాట్లాడుతూ.. ఆయనను పక్కన పెట్టుకొని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. నలిగిపోయారు. జైల్లో చూశాను. భువనేశ్వరి బాధను చూశాను. మీరు కన్నీళ్లు పెట్టుకోకండి అని ఓదార్చను అని పవన్ కల్యాణ్ చెప్పారు.
భువనేశ్వరికి ఒకే మాట ఇచ్చాను. మీకు మంచి రోజులు వస్తాయని చెప్పాను.మంచి రోజులు అనుకొన్నట్టే వచ్చాయి. ఆయనకు మనస్పూర్తిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలనను అందించాలని కోరుకొంటున్నాను అని చంద్రబాబు రెండు చేతులు పట్టుకొని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గణనీయమైన అభిమానం పెరిగింది. ఒక్కొ సీట్లో సునామీ మాదిరిగా ఓట్లు పడి.. నాకు మరింత బలంగా మార్చింది. మిత్రుడు పవన్ కల్యాణ్‌కు మనస్పూర్తిగా అభినందనలు అంటూ చంద్రబాబు అన్నారు.

తప్పు చేసిన వాడిని క్షమించి వదిలేస్తే.. అది అలవాటుగా మారుతుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్లకు చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది. కక్షలుకు తావు లేదు. విధ్వంసాలు జరగకూడదు. నేను సీఎంగా ఉన్నా, నా మిత్రుడు ఏ హోదాల ఉన్నా.. సాధారణ వ్యక్తులగానే వస్తాం. పవన్‌కు రేపు పదవిని ప్రకటిస్తాం. మీలో వ్యక్తిగా ఉంటా. మాకు హోదా సేవ కోసమే అని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











