Chandra Mohan శంకరాభరణం ప్రభంజనం..అలా కోట్లు నష్టపోయిన చంద్రమోహన్.. ఏం జరిగిందంటే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు. వృద్దాప్య సంబంధిత, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం నవంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పామిడిముక్కలలో 1943 సంవత్సరం మే 23వ తేదీన జన్మించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. చంద్రమోహన్ మృతికి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ 1966 సంవత్సరంలో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మీనా, ఓ సీత కథ, మాంగల్య బలం, రాం రాబర్ట్ రహీం, శుభోదయం, స్వర్గం, శంకరాభరణం లాంటి సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం గోపిచంద్ నటించిన ఆక్సీజన్.ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Chandra Mohan looses crores of Rupees for Shankarabharanam rights

అయితే చంద్రమోహన్ తన జీవితంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకొన్నది. శంకరాభరణం సినిమాలో నటించిన సమయంలో ఆయనకు ఓ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారు. సినిమా రిలీజ్ వరకు కూడా ఆయనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అయితే నిర్మాత వెంటపడి రెమ్యునరేషన్ కోసం ప్రయత్నించారు. అయితే శంకరాభరణం బిజినెస్ కాకపోవడంతో పారితోషికం ఇవ్వడం ఆలస్యమైంది.

అయితే చివరకు శంకరాభరణం సినిమా తమిళ హక్కులు చంద్రమోహన్‌కు ఇచ్చారు. అయితే సినిమా ఆడుతుందని పెద్దగా నమ్మకం లేకపోవడం వల్ల ఆయన తనకు రాసిచ్చిన హక్కులను తమిళంలో ఓ నటికి అమ్ముకొన్నారు. అలా తన రెమ్యునరేషన్‌ను రాబట్టుకొన్నారు. అయితే తమిళ హక్కులను అమ్ముకోవడం వల్ల భారీగా డబ్బును కోల్పోయారు.

శంకరాభరణం సినిమా రిలీజైన వారం రోజుల వరకు పెద్దగా స్పందన కనిపించలేదు. వారం తర్వాత ఆ సినిమా ప్రభంజనం మొదలైంది. తమిళంలోనే కోట్లాది రూపాయలు వసూలు చేసింది. భారీ లాభాలను సాధించింది. చంద్రమోహన్ తన హక్కులను అమ్ముకోకపోతే కోట్ల రూపాయలు వచ్చి ఉండేవి. ఆ విషయాన్ని శంకరాభరణం సంబంధించి ఓ ఈవెంట్‌లో ఆయన చెప్పారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో 900 చిత్రాలకుపైగా నటించిన చంద్రమోహన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్తం ఆయన భౌతికకాయాన్ని తన నివాసంలోను, ఆ తర్వాత ఫిలిం ఛాంబర్‌లో ఉంచుతారని బంధువులు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X