చంద్రబాబును మళ్లీ కెలికిన వర్మ.. పవర్‌స్టార్‌కు రెండే ఆప్షన్లు అంటూ కొత్త కాంట్రవర్సీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ తో ఏ స్థాయిలో హడావుడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజురోజుకి పవర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ డోస్ పెరిగేలా పాత్రలకు సంబంధించిన కాంట్రవర్సీ ఫొటోలను రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇటీవల చంద్రబాబు పాత్రను కూడా దించేశారు. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఎదో చర్చిస్తున్నట్లు పోస్టర్స్ ఉండడంతో అవి కూడా వైరల్ గా మారాయి.

ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేస్తున్నాడు.

ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేస్తున్నాడు.

మొన్నటివరకు హాట్ మసాలా సినిమాలతో హడావుడి చేసిన రామ్ గోపాల్ వర్మ సడన్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం వైరల్ అవుతోంది. కొంత మంది అభిమానుల నుంచి విమర్శలు ఎన్ని వస్తున్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో తెలియదు గాని వర్మ ఈ పోస్టర్స్ తో ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేస్తున్నాడు.

చంద్రబాబుతో పవన్

చంద్రబాబుతో పవన్

ఒక పోస్టర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీర్ఘంగా చర్చించుకుంటున్నట్లు ఉండగా మరొక పోస్టర్ లో బాబు, పవన్ ని ఎదో తిడుతున్నట్లు చూపించారు. అనంతరం 2024 ఎన్నికల్లో నీకు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని చంద్రబాబు చూపిస్తున్నట్లుగా వర్మ క్రియేట్ చేసిన తీరు కాంట్రవర్సీకి దారి తీస్తోంది. పోస్టర్స్ ద్వారానే ఆర్జీవి పవర్ స్టార్ సినిమా ఎలా ఉంటుందో ముందుగానే చెప్పేస్తున్నాడు.

 పవర్ స్టార్.. కాంట్రవర్సీలో సెంటిమెంట్

పవర్ స్టార్.. కాంట్రవర్సీలో సెంటిమెంట్

ఇక పవర్ స్టార్ సినిమాను వర్మ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే విషయం ఇంకా చెప్పలేదు గాని ఒక రూమర్ అయితే గట్టిగా వినిపిస్తోంది. జులై 24న ఆ సినిమాను ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. వర్మ ఆ డేట్ ని సెట్ చేసుకోవడానికి కారణం 1998లో తొలిప్రేమ సినిమా కూడా అదే డేట్ కి రిలీజ్ అయ్యింది. దీంతో కాంట్రవర్సీలో సెంటిమెంట్ అన్నట్లుగా వర్మ తన ఆర్జీవి వరల్డ్ లో పవర్ స్టార్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
అప్సర కోసం RGV..

అప్సర కోసం RGV..

అలాగే మరోవైపు హాట్ బ్యూటీ అప్సరను కూడా ఆర్జీవి ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెతో వర్మ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అప్సర రాణి పేరుపై 50 ఫేక్ ట్విట్టట్ ఎకౌంట్స్ క్రియేట్ అవ్వడంతో వర్మ షాక్ అవుతూ ఆమెను మరింత ప్రమోట్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X