Guntur Kaaram జగన్ రెడ్డి కుర్చీ మడత పెట్టి కొడతారు..గుంటూరుకారం పాటతో చంద్రబాబు మాస్ వార్నింగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గుంటూరుకారం. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. ఇక ఈ సినిమాలోని పాటలు సినీ అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌ను సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలోని బహుళ ప్రాచుర్యం పొందిన కుర్చి మడతపెట్టి పాట ప్రస్తుతం రాజకీయ నేతలను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నది. తాజాగా ఈ సినిమా పాట చంద్రబాబు నోట వినిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రబాబు మాస్ స్పీచ్ గురించిన వివరాల్లోకి వెళితే..
గుంటూరుకారం సినిమాలోని పాటలకు భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓ సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్ ఊత పదాన్ని సంగీత దర్శకుడు తమన్ పాటగా మలిచారు. రిలీజైన రోజు నుంచే ఈ పాట సాధారణ ప్రేక్షకులకు చేరువైంది. సినిమా రిలీజ్ తర్వాత మరింత ప్రాచుర్యం పొందింది.

కుర్చీ మడతపెట్టి పాటకు సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించడం రికార్డుగా మారింది. ఇక వీడియో సాంగ్ 44 మిలియన్ల వ్యూస్ సాధించింది. అలాగే ఇన్స్‌టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల రీల్స్ నమోదయ్యాయి. అలాంటి పాట సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నది.
Recommended Video

ఇదిలా ఉండగా, ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయా పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రాలో పోటాపోటీగా సభలు, స్పీచ్‌లు కొనసాగుతున్నాయి. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు తాజాగా సభలో మాట్లాడుతూ.. కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను తన స్పీచ్‌కు అనుకూలంగా మార్చుకొన్నాడు.
ఏపీలో జరిగిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నీవు, నీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే.. మా టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజలు కుర్చీలు మడతపెడుతారు. అందరూ కుర్చీ మడతపెడితే.. ఏమౌతుందో తెలుసా జగన్ రెడ్డి.. నీకు కుర్చీ లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మా కార్యకర్తలు చొక్కా చేతులు మడతపెట్టి తడాఖా చూపిస్తారు అంటూ కామెంట్ చేశాడు. దాంతో చంద్రబాబు కౌంటర్ ఇస్తూ కుర్చీ మడతపెడుతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో చంద్రబాబు స్పీచ్‌కు సంబంంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.


Click it and Unblock the Notifications











