twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలోచించండి అన్నలారా.. గుండెను తాకేలా చంద్రబోస్ పాట

    |

    కరోనా వైరస్‌పై పోరాడేందుకు ప్రపంచ మానవాళిని కాపాడేందుకు వైద్యులు, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అయితే ఈ విషయాన్ని కొందరు మరిచి, మానవత్వాన్ని విడనాడి వారిపైనే దాడులు చేస్తున్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు కోకోల్లలు. కరోనా వైరస్ ఇంతలా ప్రభావం చూపుతున్నా.. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతోన్న కొందరు పౌరులలో మాత్రం ఎలాంటి బాధ్యత కనిపించడం లేదు.

    నిజామాబాద్‌లో ఆశా వర్కర్లపై దాడి, గాంధీలో వైద్యులపై దాడి, పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల పోలీసులపై ఆకతాయిలు తిరగబడటం లాంటి ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మన కోసం, సమాజం కోసం వారి ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడుతున్న వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ సమాజం మొత్తం ఆ ఘటనలను ఖండించింది. పోలీసులు చేస్తున్న సేవలను, వారికి సహకరించాల్సిన బాధ్యతను గుర్తు చేసే విధంగా పాటల రచయిత చంద్రబోస్ ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చాడు.

    Chandrabose Song On Police Attacked In Corona Crisis

    కరోనా లాంటి కష్టం కాలంలో పోలీసుల విధి నిర్వహణ ఎంతో గొప్పగా ఉందని చంద్రబోస్ కొనియాడాడు. అయితే కొందరు ప్రజలు సహకరిస్తున్నారని మరొకొందరు సహకరించడం లేదని పేర్కొన్నాడు. ఈ అంశంపై ఓ పాట రాయాలని సజ్జనార్ కోరారని, బాధ్యతతో రాసిన ఆ పాట అంటూ ఎంతో ఆవేదనతో ఆలపించాడు. ఆలోచించండి అన్నలారా ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా.. రక్షించే పోలీసులను రాళ్లతోటి కొడతారా.. ప్రాణాలను అర్పించే పోలీసును పగవాడగిగా చూస్తారా? అంటూ గుండెను తాకేలా పాడాడు.

    English summary
    Chandrabose Song On Police Attacked In Corona Crisis. "aalochinchandi annalaara-aavesham maanukondi tammullara", a heart touching song from the pen of boselyricist garu for the police who are fighting against #Covid_19 released by cpcybd
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X