డైరెక్టర్ వరుస ఫ్లాపులకు చెక్ పెట్టనున్న ప్రభాస్.. టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్
టాలీవుడ్‌లో టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజాగా తాను రూపొందించిన చెక్ చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచారు. అయితే గత కొద్దికాలంగా దారుణమైన ఫ్లాఫ్ చిత్రాలతో కెరీర్ కొనసాగిస్తున్న చంద్రశేఖర్ ఏలేటికి మరో బంపర్ ఆఫర్ లభించిందనే విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌తో చెక్ సినిమాకు ముందే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటికి ఓ ప్రాజెక్ట్ ఒకే అయింది. చెక్ ఫ్లాప్ తర్వాత కూడా ఏలేటిపై మైత్రీ పూర్తిగా నమ్మకంతో ముందుకెళ్తున్నది. అయితే ఇటీవల కాలంలో చంద్రశేఖర్ ఏలేటి కథను ప్రభాస్‌కు వినిపించగా పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ప్రభాస్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ సెట్ అయినట్టు సమాచారం. అయితే సినీ వర్గాలు ఈ వార్తను నమ్మలేకపోతున్నట్టు తెలుస్తున్నది.

ఏది ఏమైనా, గత కొద్దికాలంగా చంద్రశేఖర్ ఏలేటి భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. చెక్ సినిమాతో సూపర్ హిట్ అందుకొంటాననే విశ్వాసంతో ఉన్న ఆయనకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారనే వార్తల మధ్య ప్రభాస్‌తో సినిమా తెరపైకి రావడం సినీవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.


Click it and Unblock the Notifications











