రవితేజ కొత్త సినిమాకు చిరంజీవి టైటిల్: ఆ మేజిక్‌ను మరోసారి చూపించబోతున్నారట

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్ జోష్ మీద ఉన్న అతడు.. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే తన 68వ సినిమాను కూడా ప్రకటించాడీ సీనియర్ హీరో. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాపై ప్రకటన సమయంలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే తన గత చిత్రాల మాదిరిగానే దీన్ని కూడా చిత్రీకరించబోతున్నాడట డైరెక్టర్ త్రినాధరావు నక్కిన.

RT68గా రూపొందనున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ అయిన 'చంటబ్బాయి' టైటిల్‌ను పెట్టబోతున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీని కోసం మెగాస్టార్ నుంచి పర్మీషన్ కూడా తీసుకున్నారని.. ఆ వెంటనే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించారని సమాచారం. అప్పటి చంటబ్బాయి మాదిరిగానే దీన్ని కూడా కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే పట్టుబట్టి మరీ ఆ టైటిల్‌ను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

CHANTABBAI Title Fix for Ravi Teja - Trinadha Rao Nakkina Movie

ఇక, రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్‌తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ఫీమేల్ లీడ్స్‌గా చేస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా తండ్రీ కొడుకుల పాత్రలు అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న 'ఖిలాడీ' మూవీ మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X