twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్దరాత్రి నడిరోడ్డుపై ఛార్మీకి మసాజ్.. నా వల్ల కాదంటూ.. వీడియో వైరల్

    |

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీదున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ షూటింగ్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాకు ఛార్మీ కూడా నిర్మాతేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోల్లో ఛార్మీ లేని పిక్ అంటూ ఉండదు. ఎందుకంటే నిరంతరం సెట్స్‌లోనే ఉంటూ ప్రతీది దగ్గరుండి చూసుకుంటుంది.

    కరణ జోహర్‌తో కలిసి..

    కరణ జోహర్‌తో కలిసి..

    ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన పూరి.. విజయ్‌తో ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు.బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్.. పూరీ కనెక్ట్స్‌పై ప్యాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీతో రౌడీ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

    ప్రత్యేక శిక్షణ..

    ప్రత్యేక శిక్షణ..

    ఫైటర్ మూవీ కోసం విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. థాయ్‌లాండ్ వెళ్లి మరీ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయిన్ అయి వచ్చాడు. ఈ సమయంలో విజయ్‌తో పాటు ఛార్మీ కూడా ఉంది. దగ్గరుండి అతనికి సంబంధించిన విషయాలన్నీ చూసుకున్నట్లు తెలుస్తోంది.

    బైక్‌పై షికారు..

    పూరీ సినిమా అంటే రొమాన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూరీ మార్క్ అనేది డైలాగ్స్‌లో, రొమాంటిక్ సీన్స్‌లో కనిపిస్తుంది. ప్రతీ సినిమాలో ప్రత్యేకంగా ఓ ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ ఉంటుంది. ఇక పూరీ హీరోయిన్స్ ఎంత రఫ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బొంబాయి నడిరోడ్డులో హీరో హీరోయిన్ల చేత బైక్ మీద నుంచే రొమాన్స్ చేయిస్తున్నాడు పూరి.

    నిర్మాతకు మసాజ్..

    నిర్మాతకు మసాజ్..

    ఇక షూటింగ్ జరగుతున్నంత సేపు అక్కడే ఉన్న ఛార్మీకి విసుగొచ్చిందో ఏమో గానీ.. హెడ్ మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. నిర్మాతలైతే ఇలా ఉంటుందంటూ ట్వీట్ చేసింది. ఇక నావల్ల కావడం లేదు.. షూటింగ్ ప్యాక్ చెప్పాల్సిందేనని అంటోంది.

    English summary
    Vijay Deverakomda And Puri Jagannadh Movie Shooting In Full Swing. Now Vijay Ananya Romantic Bike Sequence Is Going On. In Thsi Set Charmme Has Relaxing WIth Head Masssage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X