గుడ్‌న్యూస్ చెప్పిన ఛార్మీ.. దండం పెడుతూ పోస్ట్
ఛార్మీ గత కొన్ని రోజుల క్రితం తన తల్లిదండ్రుల గురించి ఓ పోస్ట్ పెట్టింది. తన పేరెంట్స్ కరోనా బారిన పడ్డారంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి నుంచి వారు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారని తల్లిదండ్రుల గురించి ఛార్మ చెప్పింది. దురదృష్టం కొద్దీ వారు కోవిడ్-19 బారిన పడ్డారని పేర్కొంది. బహుశా హైదరాబాద్ వరదల మూలాన ఇది జరిగి ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే నాన్నకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ వార్త విని గుండె ముక్కలయ్యిందని ఛార్మీ ఎమోషనల్ అయింది. మా పేరెంట్స్ ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చేరారని, మాకు చాలాకాలంగా తెలిసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. అయితే తాజాగా ఛార్మీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తన పేరెంట్స్ కరోనా నుంచి కోలుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

తన పేరెంట్స్ ఎలా ఉన్నారని యోగ క్షేమాలు అడుగుతున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని ఛార్మీ ట్వీట్ చేసింది. ఈ మేరకు ఛార్మీ స్పందిస్తూ.. 'మా అమ్మ నాన్నల ఆరోగ్యం గురించి అడుగుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. ఏజీఐ హాస్పిటల్ నుంచి వారిద్దరూ డిశ్చార్చ్ అయ్యారు. హైద్రాబాద్‌లోని వారి ఇంట్లో క్వారంటైన్ అయ్యారు. మరో రెండు వారాలు క్వారంటైన్‌లోనే ఉంటారు. వైద్య బృందానికి, వారి ఇచ్చిన మద్దతకు చాలా ధన్యవాదాలు' అంటూ చార్మీ దండంపెట్టేసింది.


Click it and Unblock the Notifications











