twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి, రామ్‌లతో బీర్ పొంగిస్తూ ఎంజాయ్ చేసిన బ్యూటీ.. ఫీలింగ్ అంటే ఇదీ అనేసిన ఛార్మి

    |

    Recommended Video

    Ram Pothineni Crazy Celebration With iSmart Shankar Movie Team || Filmibeat Telugu

    ఇస్మార్ట్ శంకర్ టీమ్ యమ జోష్‌లో ఉంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న హిట్ పడటమే కాదు, ఊహించిన దాన్ని మించి రెస్పాన్స్ వస్తుండటం డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఆనందానికి హద్దుల్లేకుండా చేసేసింది. ఇప్పటికే ఇస్మార్ట్ జోష్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన టీమ్.. గత రాత్రి బీర్ పొంగిస్తూ ఖుషీ ఖుషీ అయింది. అయితే ఇప్పటివరకు చేసిన సంబరాలు ఒకెత్తయితే, రాత్రి జరిగిన ఈ సంబరాలు మరో ఎత్తు అంటోంది ఛార్మి. ఇంతకీ ఆమె ఎందుకీమాట అంది. అంత స్పెషల్ విశేషం ఏమిటి? ఓ సారి చూసేద్దామా..

    ఛార్మి సంబరం మామూలుగా లేదు

    ఛార్మి సంబరం మామూలుగా లేదు

    ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ టాక్ వచ్చిన మొదటి షో నుంచే అందరి కంటే ఎక్కువ ఖుషీగా కనిపిస్తోంది ఛార్మినే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌తో నిన్న జరిగిన మీట్‌లో మాత్రం బీర్ పొంగిస్తూ మరింత హుషారుగా కనిపించింది ఛార్మి. అందుకు కారణం ఈ సారి సెలెబ్రేషన్స్‌లో హీరో రామ్ కూడా జాయిన్ కావడమే.

    బీర్ పొంగించి ఎంజాయ్ చేసింది.. ఆ వీడియో ట్వీట్ పెట్టింది

    గతంలో రామ్‌గోపాల్ వర్మతో కలిసి బీర్లు పొంగించే పండుగ చేసుకున్న ఛార్మి అండ్ టీమ్.. గత రాత్రి జరిగిన పార్టీలో హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి బీర్ పొంగించి ఎంజాయ్ చేశారు. ఈ మేరకు సదరు వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది ఛార్మి. పైగా దీనిపై ''ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ ఫీలింగ్ అంటే ఇదీ'' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

    విదేశాల్లో ఉన్న రామ్ వచ్చేయడంతో

    విదేశాల్లో ఉన్న రామ్ వచ్చేయడంతో

    ఇస్మార్ట్ శంకర్ విడుదల కాగానే సొంత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన హీరో రామ్.. ఇప్పటిదాకా జరిగిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనలేదు. నిన్ననే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన ఇస్మార్ట్ టీమ్ తో కలిసి ఇలా ఎంజాయ్ చేశాడు. ఇస్మార్ట్ టీమ్ లో రామ్ జాయిన్ కావడంతో ఛార్మి, పూరిలో మరింత ఎనర్జీ వచ్చేసింది.

    కలెక్షన్ల సునామీ

    కలెక్షన్ల సునామీ

    మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ 65 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. ఈ మేరకు చిత్రయూనిట్ సహా ట్రేడ్ వర్గాలు కూడా ఖుషీ అవుతున్నారు.

    ఇస్మార్ట్ శంకర్ సినిమా

    ఇస్మార్ట్ శంకర్ సినిమా

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేసింది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ సినిమా అందించిన విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. This movie collecting huze amount of money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X