Charmy Kaur: పూరితో విబేధాలు.. చిల్! అంటూ ఛార్మి ఊహించని రియాక్షన్.. మళ్ళీ బౌన్స్ బ్యాక్ ప్లాన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మంచి హైప్ తో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమా లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూరి ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ అందుకోవడం వలన చిత్ర యూనిట్ సభ్యులు చాలా వరకు సైలెంట్ అయ్యారు. ఇక ప్రస్తుతం పూరి, ఛార్మి పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఛార్మి సోషల్ మీడియా ద్వారా చిల్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

డిజాస్టర్ టాక్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉన్న పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో భారీ స్థాయిలో లైగర్ అనే ఫ్యాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా అంచనాలను తలక్రిందులు చేస్తూ డిజాస్టర్ టాక్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని నష్టాలను కలుగజేసింది.

ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?
ఇక లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో పూరి జగన్నాథ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. ముఖ్యంగా ఆయన నెక్స్ట్ విజయ్ తో చేయాలని అనుకున్న జనగణమన సినిమా కూడా ఆగిపోయే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ కూడా మరోసారి పూరి దర్శకత్వంలో నటించకపోవచ్చని కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి.

విబేధాలు వచ్చాయా?
ఇక లైగర్ డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ నిర్మాత ఛార్మి మధ్యలో కూడా విబేధాలు వచ్చినట్లు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. లైగర్ నష్టాలతో ఛార్మి తీవ్రమైన ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నట్లు మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. ఇక ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా కూడా పూరి టీమ్ పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు.

క్లారిటీ ఇచ్చిన ఛార్మి
ఇక ఫైనల్ గా ఛార్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం వైరల్ గా మారుతోంది. చిల్ గాయ్స్ అంటూ.. సోషల్ మీడియా నుంచి కేవలం ఒక బ్రేక్ తీసుకుంటున్నాను. పూరి కనెక్ట్స్ బిగ్ రేంజ్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు బ్రతుకు, బ్రతికించు అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. లైగర్ అనంతరం ఛార్మి సినిమా రిజల్ట్ పై పెద్దగా స్పందించింది లేదు. ఇక ఇప్పుడు ఆమె ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

కొత్త ప్రాజెక్ట్?
ఇక లైగర్ సినిమా అనంతరం పూరి, ఛార్మి మళ్ళీ విజయ్ దేవరకొండతోనే జనగణమన అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఇక ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా లేదా అనే విషయంలో రౌడి ఫ్యాన్స్ చాలా వరకు సోషల్ మీడియాలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికి ఛార్మి ఇచ్చిన వివరణతో మళ్ళీ పూరి కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ ఇస్తారని అనిపిస్తుంది. మరి ఈ కాంబో మళ్ళీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











