డ్రగ్స్ కేసులో ముగిసిన ఛార్మి విచారణ.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అంటూ సమాధానం

2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో విచారణను ఎదుర్కొన్న కొందరు ప్రముఖ సెలబ్రెటీలు మరోసారి
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతున్నారు. డ్రగ్స్ కోసం లావాదేవీలు ఎవరి ఎకౌంట్ నుంచి జరిగాయి అనే కోణంలో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సెలబ్రెటీలలో కొందరికి ప్రత్యేకమైన డేట్స్ ఇచ్చిన ఈడీ అధికారులు తగిన సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశాలను జారీ చేసి నోటీసులు కూడా పంపారు.

ఇక ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాడనికి ముందుకు వస్తున్నారు. ఇటీవల సెన్సేషనల్ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పూరి బిజినెస్ పాట్నర్ అయినటువంటి ఛార్మి కార్ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. ఇక ఆ విషయంపై ఛార్మి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.

పెద్దవాళ్ళు ఉన్నారని ఆరోపణలు

పెద్దవాళ్ళు ఉన్నారని ఆరోపణలు

2017 లో డ్రగ్స్ కేసు వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు విచారణ జరుపగా మరి కొన్నాళ్లకు అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ నాలుగేళ్ల అనంతరం కేసులో అసలు గుట్టును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దవాళ్లు ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈడీ అధికారులు కూడా అన్ని కోణాల్లో విచారణ వేగవంతంగా చేస్తున్నారు.

అందరూ మర్చిపోయిన సమయంలో..

అందరూ మర్చిపోయిన సమయంలో..

అప్పట్లోనే ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో కొంతమంది సెలబ్రెటీలను విచారించింది. రక్త నమూనాలు, గోళ్ళు, జుట్టు వంటి వాటిని కూడా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం కూడా పంపారు. అయితే ఆ పరీక్షల ఫలితాలపై పెద్దగా వార్తలు అయితే రాలేదు. ఇక కేసు గురించి అందరూ మెల్లగా మర్చిపోయారు. ఇక మళ్ళీ చాలా కాలం అనంతరం గవర్నెన్స్ అనే సంస్థ ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది.

ముగిసిన ఛార్మి విచారణ

ముగిసిన ఛార్మి విచారణ

ఇక రీసెంట్ గా దర్శకుడు పూరి జగన్నాధ్ ను కొన్ని గంటల పాటు విచారణ జరిపిన అధికారులు 2017 బ్యాక్ ఎకౌంట్స్ లవా దేవిలపై కూడా పూర్తి ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఇక దర్శకుడు కూడా అధికారులు అడిగిన విషయాలన్నిటికి సమాధానం చెప్పి తగిన ఆధారాలు కూడా సమర్పించారు. ఇక గురువారం మాజీ హీరోయిన్ ఛార్మి కూడా విచారణకు హాజరయ్యారు. ఆమె ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు కూడా ఈడీ అధికారులు అడిగిన అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Recommended Video

Liger : Vijay Deverakonda, Ananya Panday's Liger Gets Release Date
ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను..

ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను..

ఈడీ అధికారులు కోరినట్లుగా ఆమె బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సమర్పించినట్లు చెప్పారు. అలాగే పూర్తి దర్యాప్తుకు కూడా సహకరిస్తానని చెబుతూ.. ఈ డీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణలో పాల్గొంటాను అని మాట్లాడారు. ఇక ఈడీ అధికారులు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను అంటూ ఈడీ అధికారులు ఎప్పుడు విచారణ కు హాజరు కావాలని ఆదేశించిన నేను సహకరిస్తాను అని మరోసారి క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఫైనల్ గా కేసు దర్యాప్తు కొనసాగుతుంది, ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను.. అని కూడా ఛార్మి తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X