ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది.. రాజమౌళి వచ్చి బాధపడ్డాడు.. ఛత్రపతి శేఖర్ కామెంట్స్
రాజమౌళి సినిమాల్లో కనిపించే రెగ్యులర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. విలన్ పక్కన కనిపించినా.. హీరో స్నేహితుడిగా నటించినా.. తనదైన శైలి నటనతో అందర్నీ మెప్పిస్తాడు శేఖర్. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఛత్రపతి శేఖర్‌గా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

అలా ప్రభాస్ ప్రాణాలు కాపాడాడు..
ఛత్రపతి సినిమాలోని సముద్రంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటూ.. అక్కడ తాను నీటిలోంచి పైకీ లేచే సీన్‌లో పట్టు తప్పి మునిగిపోబోయానని అన్నాడు. అప్పుడు ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకున్నాడని, ఆ సమయంలో నాకు ఊపిరి ఆడకపోవడంతో చనిపోతా అనుకున్నానని తెలిపాడు. అలా ప్రభాస్ తన ప్రాణాలు కాపాడాడని తెలిపాడు.

సై సమయంలో అలా..
సై సినిమా షూటింగ్ సమయంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగిందని వివరించాడు. నితిన్ తన ఛాతిపై కొడితే ఆ ఫోర్స్‌కు తన వెనకాలున్న బిక్షు యాదవ్ ఎగిరిపడాలి ఇది సీన్. ఈ సీన్ తీసే సమయంలో తనకు చాలా ఇబ్బంది ఎదురైందని చెప్పుకొచ్చాడు.
Recommended Video


ప్రదీప్ రావత్ వల్లే...
ప్రదీప్ రావత్‌కు రోప్స్ కట్టారని, తనకు దెబ్బ తగలకుండా ఛాతికి అడ్డుగా ఓ వస్తువు పెట్టారని చెప్పుకొచ్చాడు. అయితే నితిన్ వేసుకున్నవి స్పోర్ట్స్ షూస్.., ప్రదీప్ రావత్‌కు టైమింగ్ దొరకడం లేదు సరిగా జంప్ చేయడం లేదని ఆ రోజు చాలా కోపం వచ్చిందని తెలిపాడు. చివరకు షాట్ అయి ఇంటికి వెళ్లాక చూసుకుంటూ మొత్తం గీసుకుపోయిందని చెప్పుకొచ్చాడు.

రాజమౌళి బాధపడ్డాడు..
ఇలా ప్రదీప్ రావత్ వల్ల ఆ రోజు ఆ సీన్‌కు దాదాపు ఎనిమిది టేక్స్ తీసుకున్నట్టున్నామని అన్నాడు. ప్రతీసారి నితిన్ తన ఛాతిపై తన్నడం, ప్రదీప్ రావత్ ఎగరకపోవడంతో రాజమౌళి.. తన వద్దకు వచ్చి ఏం పర్లేదు కదా శేఖర్ ఆయనకెన్ని సార్లు చెప్పినా.. అర్థం కావడం లేదని అంటూ చాలా బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. చివరకు తనకు కోపం వచ్చి.. ప్రదీప్‌కు షాట్ ఎలా చేయాలో చెప్పానని అన్నాడు.


Click it and Unblock the Notifications











