Samantha.. చెప్పరాని చోట సమంతకు టాటూ.. ఆ హీరో పేరు ప్రత్యక్షంతో రూమర్లకు బ్రేక్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా సరే.. వీరి వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. భర్తతో విడాకులు తీసుకున్న సమంత.. తన సినిమాలతో తాను బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తో ఆమె మళ్లీ అడ్డంగా బుక్ అయింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కూడా ఏంటి సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకుల మనసును... తన అందంతో కట్టిపడేసింది. ఇక అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్లిన సమంత... నాగచైతన్యతో కొన్నాళ్ల పాటు కలిసి ఉంది. ఇక ఏమైందో తెలియదు.. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసేసుకుంది. కానీ అప్పటినుంచి వీరి గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. సమంత ప్రస్తుతం బిజియెస్ట్ హీరోయిన్లలో ఒకరు.

అయితే నాగచౌతన్య, సమంత కలిసి ఉన్న రోజుల్లో క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ఉన్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో ఉన్నప్పుడు చైతు, సమంత టాటూలు వేయించుకున్నారు. అయితే సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండగా... అందులో ఏ మాయ చేసావే సినిమాకు గుర్తుగా... మెడకు కిందకు YMC అని ఉంటుంది. ఇంకోటి చేతిపై బాణం గుర్తు తరహాలో టాటూ ఉంటుంది. ఇంకోటి.. రిబ్స్ పైన మరో టాటూ చై అని ఉంటుంది.
అయితే ఇటీవల ఫోటోల్లో రిబ్స్ మీద ఉన్న టాటూ మాయం అయినట్లు చూపించారు. నిన్న మొన్నటి వరకు షేర్ చేసిన ఫోటోల్లో కూడా ఆ టాటూ మాయం అయినట్లు కనిపించింది. టాటూ తీయించేసుకుని తన మనసులోనూ చై జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసిందని అంతా అన్నారు. అయితే మళ్లీ సామ్ ట్విస్ట్ ఇచ్చింది. సమంత ఒంటిపై మళ్లీ ఆ టాటూ ప్రత్యక్ష్యం అయింది.

సమంత ఒంటిపై చై అనే టాటూ ఇంకా ఉన్నట్లు తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో రిబ్స్ పై భాగంలో చై అని రాసి ఉన్న టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గతంలో కేవలం ఆ పచ్చబొట్టు కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసిందా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి అసలు ఈ టూటూ ఉన్నట్టా లేనట్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో సామ్ అందంగా స్టైలిష్ గా ఉంది. మరి ఇది పాత ఫోటోనా.. లేదా రీసెంట్ అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సామ్.. నాగ చైతన్యను మరిచిపోలేదని నెటిజన్స్ అంటున్నారు. అందుకే ఇలా ఫోటోలు పెట్టి.. అటెన్షన్ కోరుకుంటుందని చాలా మంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











