twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ న్యూ పోస్టర్: ఈ కామెడీ స్టార్ యాక్షన్ మోడ్లో...

    |

    ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' ఆగస్టు 30న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. సినిమాలోని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల చేయగా తాజాగా చుంకీ పాండే లుక్ వదిలారు.

    పలు బాలీవుడ్ చిత్రాల్లో కామెడీ టైమింగ్‌తో నవ్వించే చుంకీ పాండే 'సాహో'లో ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. 'రైజ్ ఫ్రమ్ ది యాషెస్' అనే క్యాప్సన్‌తో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో చుంకీ పాండే.. దేవరాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్ర ఈ మూవీలో కీలకంగా ఉంటుందట.

    Check out Chunky Pandey Poster from Saaho

    ఈ చిత్రంలో ప్ర‌భాస్ సరసన బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేష‌న్స్ బేనర్లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‍‌గా ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి త‌రువాత వ‌స్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీకి ప్రధాన్యత ఇస్తూ దీన్ని తెరకెక్కించారు. టెక్నికల్ వ్యాల్యూస్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి.

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇంకా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    "With his ominous looks & stead fast gaze; here comes the new character poster of Devraj ft Chunky Panday to give you some major chills! Saaho releasing worldwide on 30th August!" UV Creations tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X