రక్తం మరకలతో రెజీనా.. ‘ఎవరు’ అని ఆరా తీస్తున్న అడివి శేష్!

క్ష‌ణం, గూఢ‌చారి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ త్వరలో 'ఎవరు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. థ్రిల్ల‌ర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఎవ‌రు, బ‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. రెజీనా హీరోయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Check out Mysterious and intriguing First Look of Adivi Seshs Evaru

తాజాగా విడుదలైన 'ఎవరు' ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. పగిలిన అద్దం ముక్క నుంచి రెజీనా ఫేస్ కనిపించడం చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని స్పష్టమవుతోంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ ఫిల్మ్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో మంచి అచనాలుఏర్పడ్డాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సినిమాను ఆగ‌స్ట్ 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ: కాకా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X