For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీఎం సీఎం అరుస్తారు.. కానీ ఓట్లు వేయరు నా కొడుకులు.. పవన్ కల్యాణ్‌కు ఆంధ్రోళ్లు మోసం

  |

  దేశంలో చెడ్డి గ్యాంగ్ చోరీ ముఠా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చెడ్డి గ్యాంగ్ ముఠా పనులకు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ పేరుతో ఓ సినిమా రాబోతుంది. దొంగతనాల నేపథ్యంలో కామెడీ తరహాలో తెరకెక్కించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. అబుజా ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు. నవబంర్ 12 శనివారం ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ హీరో వెంకట్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  టీజర్ లాంచ్ కార్యక్రమం..

  టీజర్ లాంచ్ కార్యక్రమం..


  వెంకట్ కల్యాణ్ హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. అబుజా ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. గాయత్రి పటేల్ హీరోయిన్ గా అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే శనివారం అంటే నవంబర్ 12న ఈ సినిమా టీజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  హీరో షాకింగ్ కామెంట్స్..

  హీరో షాకింగ్ కామెంట్స్..

  చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా టీజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాజరయ్యాడు. చెడ్డి గ్యాంగ్ సినిమా టీజర్ ను నాగ్ అశ్విన్ లాంచ్ చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా హీరో అండ్ డైరెక్టర్ వెంకట్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనకు ఎందరో వ్యక్తులు స్ఫూర్తినిచ్చారని, ఆంధ్రోళ్లు అంటూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  మీరు చూడాలని కోరుకోను..

  మీరు చూడాలని కోరుకోను..

  "ఈ సినిమాను ఏదో సరదాగా, ఆషామాషీగా ఏదో తీసేద్దాం అని చేయలేదు. మీరు థియేటర్లలో కూర్చున్నంతసేపు ఎంటర్టైన్ చేస్తుంది. నా యాక్టింగ్ పరంగా గానీ, దర్శకత్వం పరంగా గాని మీకు ఏదో ఒక కోణంలో టచ్ అవుద్ది. మీరు చూడాలని కోరుకోను గానీ, మీరు చూస్తే మాత్రం మీకు నచ్చుతుంది. ఈ భూమ్మీద నాకు ప్రేరణ కలిగించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులను ఈ సందర్భంగా తలుచుకుంటా.

  ఆయన వీడియోలూ చూడకుండా పడుకోను..

  ఆయన వీడియోలూ చూడకుండా పడుకోను..

  పీఎం నరేంద్ర మోది సార్ నాకు చాలా ఇష్టం. నేను డల్ గా ఉంటే ఆయన వీడియోలు చూస్తా.. ఆయన జిందగీని ఫాలో అవుతా. ఒక శక్తి వస్తది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అలాగే సద్గురు గారి వీడియోలూ చూడకుండా నేను పడుకోను. ప్రతి రోజు నాకు ప్రేరణ. రోజు నేను డౌన్ అవుతుంటా దాని నుంచి పైకి లేచేందుకు ఆయన వీడియోలు ఉపయోగపడతాయి.

  ఆయన కోసమే హీరోగా మారాను..

  ఆయన కోసమే హీరోగా మారాను..

  నాకు బాగా ఇష్టమైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. నాకు మీరంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం షారుక్ సార్. ఐ లవ్యూ సార్. ఇంకా అత్యాద్భుతమైన ప్రేరణ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన బయోగ్రఫీ, పుస్తకం చూస్తరు పక్కా. ఆయన నిన్ననే వచ్చినట్లు ఉంటది. ఇక నాకు మోస్ట్ ఇన్ స్ఫైరింగ్ అతను. ఆయన కోసమే హీరోగా మారాను. ఆయన్ను కలవాలి. దండం పెట్టుకోవాలి. కౌగిలించుకోవాలి. చాలా చెప్పాలి. ఆయనే నా దేవుడు, నా శక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

  దానికన్నా వంద రెట్లు మీరు..

  పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమంటే బద్రి సినిమా చూశాకా ఆ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నా. అన్నా.. మిమ్మల్ని ఆంధ్ర వాళ్లు మోసం చేశారు. మీ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. అదే తెలంగాణ గడ్డపై మీరు పుట్టింటే మీరు సీఎం అయ్యేవాళ్లు. మీరు తెలంగాణలో పుట్టకపోవడం దురదృష్టం అన్నా. మీరు సీఎం ఏందన్నా.. దానికన్నా వందింతలు మీరు. ఆంధ్రకు పోతే సీఎం.. సీఎం.. అని అరుస్తారు.. కానీ ఓట్లు వేయరు కొడుకులు. తెలంగాణలో అయితే ఇలా జరిగేదా" అని ఎమోషనల్ గా షాకింగ్ గా మాట్లాడారు వెంకట్ కల్యాణ్.

  English summary
  Cheddi Gang Tamasha Movie Hero And Director Venkat Kalyan Shocking Comments On Andhra People Over Cheating Pawan Kalyan In Elections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X