Singer Mano: తండ్రి పరువు తీశారు.. ప్రముఖ సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు..

Singer Mano: ప్రముఖ సింగర్ 'మనో'గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ టాప్ 10 సింగర్స్ లో ఆయన ఒకరు. ఆయన తన 40 ఏళ్లు కెరీర్ లో తెలుగు, కన్నడ,తమిళ్ తో పాటు దాదాపు 11 భాషల్లో 35 వేలకు పైగా పాటలు పడ్డారు. అలాగే మనో కేవలం సింగర్ మాత్రమే కాదు.. డబ్బింగ్, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన డబ్బింగ్ వేరే లెవల్ లో ఉంటుంది. ఇక సుపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదాపు అన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. మరోవైపు పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తు బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ మనో. ఇలా ఎంతో పరువు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆయనకు మాయని మచ్చ తెచ్చారు తన కుమారులు. మనో పరువును తీశారు. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ సింగర్ మనో కుమారులపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న మనో కుమారులు రఫీక్, సాహీర్ లు తమ స్నేహితుడితో కలిసి ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల బంధువులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఆ పరారీలో ఉన్న ముగ్గురిలో మనో కుమారులు ఉన్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ టీం వారికి అదుపులోకి తీసుకుంది.

Chennai police registered a case against popular singer Mano s sons Mano s sons Rafeeq Saheer

అసలేం జరిగిందంటే.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన యువకుడు, మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల యువకుడు వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. వారిద్దరూ మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ.. ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు మరో ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ముదరడంతో దాడి వరకు వెల్లడింది. ఈ ఘటనలో కృపాకరన్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో మను కుమారులను అరెస్టు చేయగా.. మను కుమారులతో పాటు అతని స్నేహితుడు పరారీ కావడంతో వారి కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదెలా ఉంటే.. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది యువకులు బేస్ బాల్ బ్యాట్‌లు,కర్రలను పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్ ఉన్న వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: chennai police singer mano
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X