twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విధూ వినోద్ చోప్రా వేధింపులతో డిప్రెషన్.. సూసైడ్ చేసుకోవాలనుకొన్నా.. చేతన్ భగత్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మొత్తం వివాదాల పుట్టగా మారింది. తాజాగా నిర్మాత, దర్శకుడు విధు వినోద్ చోప్రాపై ప్రముఖ రచయిత చేతన భగత్ నిప్పులు చెరిగారు. 2009లో 3 ఇడియెట్స్ సినిమా రిలీజ్ సమయంలో తనను తీవ్రంగా వేధించారు. ఆయన వేధింపులకు తట్టుకోలేక ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనేంతగా క్షోభకు గురయ్యాను అని చేతన్ భగత్ పేర్కొన్నారు. చేతన్ భగత్ నటించిన ఫైవ్ పాయింట్ సమ్‌వన్ అనే పుస్తకం ఆధారంగా 3 ఇడియెట్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే..

    తన పుస్తకాన్ని, కథను వాడుకొని తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదనే గొడవ 3 ఇడియెట్స్ సమయంలో జరిగింది. తాజాగా తనకు జరిగిన మోసాన్ని మరోసారి ట్వీట్ రూపంలో చేతన్ భగత్ వెల్లడించారు. దానికి సమాధానం ఇస్తూ క్రిటిక్, విధూ వినోద్ చోప్రా భార్య అనుపమ్ చోప్రా.. ప్రతీసారి దానిని వాడుకోవాలని చూడకు. దాని వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. దానికి సాకుగా తీసుకొని ఒకరిని కించపరచడం తగదు అంటూ జవాబిస్తే.. అందుకు సమాధానంగా నన్ను సూసైడ్ చేసుకొనే విధంగా నన్ను చోప్రా వేధించాడు అని గుర్తు చేశాడు.

     Chetan Bhagat revealed suicide thoughts due to Vidhu vinod chopra harassment

    అలాగే సుశాంత్ చివరి సినిమా దిల్ బేచారాను ఆదరించాలి. పక్షపాతంగా వ్యవహరించే క్రిటిక్స్‌కు ఒకటే చెప్పాలనుకొంటున్నాను. దిల్ బేచారాపై చెత్త రాతలు రాయకుండా ఉండండి. సెన్సిబుల్‌గా, నిజాయితీగా రివ్యూలు రాయండి. చెత్త ట్రిక్కులు ప్లే చేయకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇకనైనా వాటిని ఆపండి. మేము కూడా చూస్తాం అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశారు.

    English summary
    Chetan Bhagat alleges once again Vidhu Vindo Chopra over 3 Idiots contraversy. Chetan revealed that he bullied him and almost drove him to suicide during the time of film's release in 2009.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X