Chhaava: ఆ సీన్స్ తీయకుండానే తెలుగులోకి ఛావా .. మళ్ళీ అడ్డుకుంటారా?
గత కొన్నేళ్ల కితం బాలీవుడ్ సినిమా ఎలా డౌన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ డౌన్ ఫాల్ తర్వాత వారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు చాలా సమయమే తీసుకున్నారు. అయితే ఇపుడు ఒకో సినిమా ఒకదాన్ని మించి ఒకటి రికార్డు వసూళ్లు హిందీ సినిమాలో అందుకుంటూ అదరగొడుతున్నాయి.
ఇలా రీసెంట్ గా వచ్చిన ఓ సినిమా అయితే సెన్సేషనల్ వసూళ్లు అందుకొని ఊహించని నంబర్స్ హిందీ సినిమా దగ్గర సెట్ చేస్తుంది. మరి ఆ చిత్రమే "ఛావా". ప్రముఖ హీరో విక్కీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరక్కించిన సంగతి తెలిసిందే.

కాగా భారతదేశ చరిత్ర మర్చిపోని మహా వీరులలో మరాఠా హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ కేవలం ఒక్క హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో రికార్డులు తిరగరాస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన సమయంలో అలాగే అంతకు ముందు కూడా పలు అంశాల్లో ఈ చిత్రానికి కాంట్రవర్సీలు వచ్చాయి.
మెయిన్ గా మతపరంగా పలు అంశాల్లో అలాగే ట్రైలర్ వచ్చినపుడు కూడా ఒక ఊహించని అంశంపై మరో కాంట్రవర్సీ వచ్చింది. ఇపుడు ఇదే మళ్ళీ తెలుగు రిలీజ్ లో ఇబ్బంది పెడుతుందా అనేది ఆసక్తిగా మారింది. కాగా హిందీలో ఛావా ట్రైలర్ వచ్చినపుడు అందులో ఒక సాంగ్ సీన్ కనిపిస్తుంది. కాగా ఈ సాంగ్ లో విక్కీ కౌశల్ అలాగే రష్మిక ఇద్దరూ కలిసి డాన్స్ చేసే మూమెంట్స్ ఉంటాయి.
అయితే దీనిపై పెద్ద రచ్చే జరిగింది. మెయిన్ గా మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకులు శంభాజీ మహారాజ్ ఒక 20 ఏళ్ల యువకుడు తన భార్యతో ఇలా విజయాన్ని సంబరంగా జరుపుకోవడాన్ని డాన్స్ గా చూపించడం ఏంటని వారు అన్నారు. చరిత్రని తీస్తే సరిగ్గా తీయాలని అంతే తప్ప అనవసర హంగులు వద్దని సూచించారు. దీనితో దర్శకుడు ఆ సాంగ్ ని తీసేసి హిందీలో రిలీజ్ చేశారు.
కాగా ఇపుడు తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఇపుడు తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే తెలుగులో కూడా గతంలో ఏదైతే కాంట్రవర్సీ అయ్యిందో అదే సాంగ్ ఇక్కడ ఉంచేశారు. దీనితో హిందీలో ఎదురైన నెగిటివిటీ తెలుగు వెర్షన్ కి కూడా ఎదురవుతుందా అనేది ఇపుడు ఆసక్తికర ప్రశ్న అని చెప్పాలి.
కాగా ఇది తెలుగులో సినిమాని రిలీజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారికి అటు నార్త్ నుంచి ఏమన్నా నెగిటివ్ తీసుకొస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరి తెలుగులో ఈ కాంట్రవర్సియల్ సాంగ్ ని ఉంచుతారా లేక తీసేసి రిలీజ్ చేస్తారో అనేది చూడాలి. ఇక ఈ చిత్రంకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా హిందిలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న మ్యాడాక్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











