జేఎన్‌యూ గొడవలో దీపికా పదుకొణె.. ఛపాక్ సినిమాకు నష్టాలు

Recommended Video

#Boycottchhapaak Is Trending, Deepika Padukone JNU Visit Leaves Twitter Divided || Oneindia Telugu

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రత్యక్షమైంది. హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఆదివారం రాత్రి దాడులు..

ఆదివారం రాత్రి దాడులు..

ఆదివారం యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. గుర్తు తెలియన వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మాస్క్‌ ధరించి వచ్చిన కొంతమంది దుండగులు రాడ్లు, యాసిడ్, పదునైన ఆయుధాలతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేశారు. దాదాపు రెండు గంటల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో రణరంగం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 30 మంది విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.

మద్దతు తెలిపిన దీపికా..

మద్దతు తెలిపిన దీపికా..

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక జేఎన్‌యూకి వెళ్లింది. దుండగుడల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని పరామర్శించింది. దాడి జరిగిన తీరుపై.. వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడింది.

భగ్గుమన్న రాజకీయ నేతలు..

భగ్గుమన్న రాజకీయ నేతలు..

ఐతే దీపికా జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శలు గుప్పించారు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఛపాక్ సినిమాను నిషేధించాలి..

ఛపాక్ సినిమాను నిషేధించాలి..

జేఎన్‌యూ ఘటనపై దీపికా స్పందించిన తీరును నిరసిస్తూ నెటిజన్లు ఆమెపై భగ్గమన్నారు. ఆమె తాజాగా నటించిన ఛపాక్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #BoycottChhapaak అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X