twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chhello Show ఫేమ్ రాహుల్ కోహ్లీ కన్నుమూత.. వైద్యం కోసం రిక్షా అమ్మినా.. మూవీ రిలీజ్‌కు ముందు మృతి!

    |

    RRR చిత్రంతో పోటీ పడి ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన ఛెల్లో షో సినిమాలో నటించిన బాలనటుడు రాహుల్ కోహ్లీ ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అక్టోబర్ 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాహుల్ కోహ్లీ మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ బరిలో నిలిచిన ఆనందంతో ఉన్న సినీ అభిమానులు రాహుల్ కోహ్లీ మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిభావంతుడైనా బాల నటుడి మరణంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురై.. సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. రాహుల్ కోహ్లీ వ్యక్తిగత జీవితం, ఆయనను కబలించిన వ్యాధి గురించిన వివరాల్లోకి వెళితే..

     బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం

    బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం

    చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకొన్న రాహుల్ కోహ్లీ గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలోని హపా పట్టణంలో రిక్ష్మా తొక్కుకొని జీవించే కుటుంబంలో జన్మించాడు. గత కొద్దికాలంగా లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. అయితే మృత్యువుతో చేసిన పోరాటంలో అలిసిపోయిన రాహుల్ కోహ్లి శాశ్వత నిద్రలోకి జారుకొన్నాడు.

     అనారోగ్యం నుంచి కోలుకోలేకపోవడంతో

    అనారోగ్యం నుంచి కోలుకోలేకపోవడంతో


    రాహుల్ కోహ్లీ అనారోగ్యం గురించి తండ్రి రాము కోహ్లీ మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తొలుత తీవ్ర జ్వరంతో బాధపడేవాడు. జ్వరంతో బాధపడుతున్న నా కుమారుడికి పలు రకాల చికిత్సలు చేయించాం. కానీ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయవడంతో తొలుత జామ్ నగర్, ఆ తర్వాత ఆహ్మాదాబాద్‌ హాస్పిటల్‌లో చికిత్స చేయించాం. అప్పుడే లుకేమియా వ్యాధి గురించి మాకు తెలిసింది అని తెలిపారు.

     రిక్షాను అమ్మి వైద్యం

    రిక్షాను అమ్మి వైద్యం


    గత నాలుగు నెలలుగా లుకేమియా వ్యాధితో తీవ్రమైన పోరాటం చేస్తున్న రాహుల్ కోహ్లీకి ట్రీట్‌మెంట్ అందించారు. నా కొడుకును బతికించుకొనేందుకు రిక్షాను కూడా అమ్మి వైద్యం చేయించాం. అక్టోబర్ 2వ తేదీన తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. మూడుసార్లు రక్తపు వాంతులు చేసుకొన్నారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు అని తండ్రి రాము కోహ్లీ శోకసంద్రంలో మునిగిపోయాడు.

    అక్టోబర్ 14వ తేదీన రిలీజ్

    అక్టోబర్ 14వ తేదీన రిలీజ్


    ఛెల్లో షో చిత్రం అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ సమయంలో మా అబ్బాయి లేకపోవడం బాధాకరంగా ఉంది. మా కుటుంబం అంతా సినిమా చూస్తాం. ఆ తర్వాత మా అబ్బాయి మరణానికి సంబంధించిన తుది కార్యక్రమాలను పూర్తి చేస్తాం. ఈ చిత్ర యూనిట్ మాకు రిక్షాను తిరిగి ఇప్పించారు.

     రాహుల్‌ను బతికించుకోలేకపోయాం

    రాహుల్‌ను బతికించుకోలేకపోయాం


    ఛెల్లో షో సినిమాలో మొత్తం ఆరుగురు బాలనటులు నటించారు. అందులో రాహుల్ కోహ్లి ఒకరు. మను అనే పాత్రలో రాహుల్ కనిపించాడు. చాలా టాలెంటెడ్ కుర్రాడు. రాహుల్ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. గత కొద్దివారాలుగా రాహుల్ మెరుగైన వైద్యాన్ని అందించేలా కుటుంబంతో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తూ రాహుల్‌ను బతికించుకోలేకపోయాం అని ఛెల్లో షో దర్శకు, నిర్మాత, రచయిత పాన్ నలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Chhello Show aka Last Film Show fame Rahul Kohli died with leukaemia no more. He died due to leukaemia on October 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X