For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR, ది కశ్మీర్ ఫైల్స్‌కు షాకిచ్చిన గుజరాతీ చిత్రం.. ఆస్కార్ బరిలో అధికారికంగా ఎంట్రీ!

    |

    ఆస్కార్ అవార్డుల రేసులో RRR, ది కశ్మీరి ఫైల్స్ చిత్రాలు నామినేట్ అవుతాయని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫారిన్ ఫిల్మ్స్ విభాగంలో ఈ రెండు చిత్రాలకు చోటు దక్కలేదు. కానీ గుజరాత్‌కు చెందిన ఛెల్లో షో చిత్రానికి 95వ అకాడమీ అవార్డుల్లో భారత్ తరఫున అధికారికంగా చోటు దక్కింది.

    పాన్ నలిన్ దర్శకత్వంలో రూపొందిన ఛల్లో షో (ఇంగ్లీష్‌లో లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ 2023 చిత్రంలో అధికారికంగా ఎంట్రీని సంపాదించింది. ఈ చిత్రం అక్టోబర్ 15 తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ చిత్రం మార్క్ డ్యూలే, ఛెల్లో షో ఎల్ఎల్‌పీ, మాన్‌సూన్ ఫిల్మ్స్, జుగ్గద్ మోషన్ పిక్చర్స్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్లపై సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు.

    Chhello Show gets Indians Oscar Berth officially instead of RRR, The Kasmir Files

    ఛెల్లో షో చిత్రంలో భవీన్ రబరీ, భవేష్ శ్రిమాలి,రిచా మీనా, దీపెన్ రావల్, పరేశ్ మెహతా నటించారు. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి సినిమాలపై పెంచుకొన్న అభిమానం కథగా నళిని జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

    అయితే 2023లో జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకల్లో RRR, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు అధికారికంగా ఎంట్రీ సాధిస్తాయనే ఊహాగానాలు, అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ చిన్న చిత్రం ఛెల్లో షో (లాస్ట్ ఫిల్మ్ షో) ఆస్కార్ ఎంట్రీ సాధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

    English summary
    Gujarati coming-of-age drama Chhello Show as India's official entry for the 95th Academy Awards. Titled 'Last Film Show' in English, the movie, directed by Pan Nalin, will release in theatres countrywide on October 14. "Chhello Show is India's official entry for Oscars 2023," FFI Secretary General Supran Sen told PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X