హోటల్‌లో ముద్దులు పెట్టుకోండి.. శ్రీవారి ఆలయాన వికృతచేష్టలా? కృతిసనన్, ఓం రావత్‌పై చిల్కూర్ పూజారీ సీరియస్

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినీ ప్రముఖులు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. దర్శనం తర్వాత హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రావత్ ఇద్దరు కౌగిలించుకొన్నారు. అంతటితో ఆగకుండా ముద్దులు పెట్టుకొన్నారు. ఈ వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. శ్రీవారి మాడవీధుల్లో కృతిసనన్, ఓం రావత్ ముద్దులు పెట్టుకోవడంపై ఘాటుగా స్పందిస్తున్నారు. చిలుకూరు ఆలయ పూజారీ శ్రీ సీఎస్ రంగరాజన్ ఘాటుగా స్పందిస్తూ..

కలియగ వైకుంఠ క్షేత్రంలో సినీ ప్రముఖుల ముద్దు సంఘటన దురదృష్టకరం. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ సినిమాలో సీత పాత్ర పోషించిన హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రావత్ శ్రీవారిని దర్శనం చేసుకొన్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆ ఇద్దరు మాడవీధుల్లో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొన్నారు. ఇది చాలా నీచనీయమైన సంస్కృతి అని శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారీ శ్రీ సీఎస్ రంగరాజన్ ఘాటుగా స్పందించారు.

Chilkur Balaji temple priest CS Rangarajan serious on Kriti Sanon and Om Raut Kissing inicident at tirumala temple

తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భావిస్తారు. భార్యభర్తలు దర్శనానికి వెళ్లేటప్పుడు చాలా నియమ నిబంధనలు పాటిస్తూ దూరంగా ఉంటారు. ఆ ప్రదేశంలో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం నిషేధం. సినిమా ప్రముఖులు చూపించిన వికార ప్రదర్శన అక్షేపనీయం. కావాలంటే వాళ్లు హోటల్ గదిలోకి వెళ్లి ముద్దులు, కౌగిలింతలు పెట్టుకోవచ్చు కదా. అలా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు అని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారీ శ్రీ సీఎస్ రంగరాజన్ అన్నారు.

Chilkur Balaji temple priest CS Rangarajan serious on Kriti Sanon and Om Raut Kissing inicident at tirumala temple

కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో లక్షలాది మంది భక్తులు భక్తిభావనతో పులకించిపోతారు.కోట్లాది మంది దర్శనంతో ఆనందంలో మునిగిపోతారు. అలాంటి భక్తుల మనోభావాలను కృతిసనన్, ఓం రావత్ దెబ్బ తీశారు. మీరు రామాయణాన్ని సినిమాగా తీయండి. మహాభారతాన్ని సినిమాగా తీయండి. కానీ నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. మీ ప్రవర్తన సీతా, రాములను కించపరిచే విధంగా ఉంది అని ఆలయ పూజారీ శ్రీ సీఎస్ రంగరాజన్ అన్నారు.

తెలుగులో రామాయణం ఆధారంగా రూపొందించిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు. ఆయన రాముడిని భగవంతుడిగా భావిస్తారు. ఆయనను కూడా ప్రజలు భగవంతుడిగా భావించే వారు. రాముడి సతీమణి సీత పాత్రను వేసిన నటులను కూడా అలాగే భావించే వారు. ప్రజలు వారికి ప్రేమను, అనురాగాన్ని పంచారు. ఇలాంటి చేష్టలను సినీ తారలు జరుగకుండా చేయాలి. ఇలాంటి వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారు కఠినంగా వ్యవహరించాలి అని ఆలయపూజారి శ్రీ సీఎస్ రంగరాజన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X